కజకిస్తాన్‌లో( Kazakhstan ) ఉన్న సిమ్‌కెంట్ యూనివర్సిటీలో( Simkent University ) వైద్య విద్య చదువుతున్న ఉత్కర్ష్ శర్మ( Utkarsh Sharma ) అనే విద్యార్థి గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయాడు.ఈ యువకుడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
రాజస్థాన్‌లోని అల్వార్‌కు( Alwar ) చెందిన ఉత్కర్ష్ నిన్నటివరకు అందరిలాగే మామూలుగా ఉన్నాడు.జిమ్‌కి వెళ్లాడు, ఇంట్లో వాళ్లతో సరదాగా మాట్లాడాడు, స్నేహితులతో కలిసి భోజనం కూడా చేశాడు.
రాత్రి డిన్నర్ తర్వాత కాసేపు నడిచి కూడా వచ్చాడు.కానీ ఇంటికి తిరిగొచ్చిన కాసేపటికే ఒక్కసారిగా ఒంట్లో బాలేదనిపించింది.
స్నేహితులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ, డాక్టర్లు పరీక్షించిన తర్వాత అతను చనిపోయాడని తేల్చారు.ఉత్కర్ష్ ది మంచి చదువుకున్న కుటుంబం.వాళ్ల నాన్న హోమియోపతి డాక్టర్. చదువులోనే కాదు, ఆటల్లోనూ ఉత్కర్ష్ ప్రతిభావంతుడు.
స్టేట్, నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లలో పాల్గొని చాలా మెడల్స్ కూడా గెలుచుకున్నాడు.క్లాస్‌లో కూడా ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడు.

అసలు ఊహించని విషయం ఏంటంటే, చనిపోవడానికి కొద్దిసేపటి ముందే ఉత్కర్ష్ కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలని ఇంటికి ఫోన్ చేశాడు.కానీ అతని చెల్లి తిరిగి ఫోన్ చేసేలోపే, అతని పరిస్థితి విషమంగా మారింది.ఈ షాకింగ్ న్యూస్ విన్న వెంటనే కుటుంబ సభ్యులు ఇద్దరు కజకిస్తాన్‌కు బయలుదేరారు.భారత రాయబార కార్యాలయం వాళ్లు కూడా ఉత్కర్ష్ బాడీని ఇండియాకు తీసుకురావడానికి కావాల్సిన పేపర్ వర్క్స్‌లో హెల్ప్ చేస్తున్నారు.

యంగ్, హెల్తీ, డ్రీమ్స్ ఉన్న ఉత్కర్ష్ ఇలా సడన్‌గా చనిపోవడం నిజంగా తీరని విషాదం.ఈ వార్త అతని కుటుంబ సభ్యులనే కాదు, స్నేహితులు, టీచర్లను కూడా షాక్‌కి గురిచేసింది.ఇలా చాలామందికి ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారికే గుండెపోటుకు రావడం ఆందోళన కూడా కలిగిస్తోంది.