కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీలో కాదల్ కొండేన్, 7G రెయిన్బో కాలనీ, పుదుపేట్టై వంటి అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ పాపులర్ అయ్యాడు డైరెక్టర్ సెల్వ రాఘవన్.తెలుగులో ఈ దర్శకుడు తీసిన “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఆయన తీసిన తమిళ్ హిట్ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.అందుకే ఈ దర్శకుడికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.
సెల్వ రాఘవన్ ( Selva Raghavan )తీసే సినిమాలు చాలా హార్డ్ హిట్టింగ్ గా, రియలెస్టిక్ గా ఉంటాయి.అందుకే ఆ సినిమాలు చాలామందికి నచ్చుతుంటాయి.
అయితే సెల్వ రాఘవన్ తన సినిమాల్లో నటించే నటీనటులకు ఒక కండిషన్ తప్పనిసరిగా పెడతాడు.అదేంటంటే వారు సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు కెమెరా ముందు కండ్లు ఆర్పకుండా ఉండగలగాలి.
మొదట్లో ఆ సామర్థ్యం లేకపోతే ప్రాక్టీస్ చేసైనా సరే కండ్లు గిలపకుండా ఉండాలని ఆయన సూచించే వారట.ఏ దర్శకుడు పెట్టని ఈ వింత కండిషన్ సెల్వ రాఘవన్ మాత్రమే పెట్టడానికి ఒక కారణం ఉంది.
అదేంటంటే ఒక సన్నివేశంలో క్యారెక్టర్ల క్లోజ్ షాట్స్ షూట్ చేసేటప్పుడు క్యారెక్టర్ ఎమోషన్ కండ్లల్లోనే కనిపించాలని సెల్వ రాఘవన్ కోరుకుంటాడు.కళ్ళతోనే చాలా ఎమోషన్స్ పలికేలా క్యారెక్టర్స్ ని ఈ డైరెక్టర్ డిజైన్ చేసుకుంటాడు.ఎంతసేపు కండ్లు ఆపకుండా ఉంటే ఆ క్యారెక్టర్ ఎమోషన్ అంత బాగా పండుతుందని నమ్ముతాడు.అలాగే అయిస్‌తో ఫీలింగ్స్ ప్రేక్షకులకు కన్వె చేయగలుగుతారని విశ్వసిస్తాడు.అందుకే షాట్ ఎంతసేపు ఉంటే అంతసేపూ యాక్టర్స్ కండ్లు ముయ్యకుండా యాక్టింగ్ చేయగలగాలని అతను ఒక కండిషన్ పెడతాడు.ఇది కుదరదు అన్న ఆర్టిస్టులను సినిమా నుంచి పక్కకు తప్పిస్తాడు.
అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు కాబట్టే అతడి ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్ ముఖంలో కళ్ళతోనే చాలా వరకు ఫీలింగ్స్ వ్యక్తపరచడం జరుగుతుంది.ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో వెంకటేష్ ఎంత మంచి క్యారెక్టర్ చేశాడో చెప్పనక్కర్లేదు.ఈ క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా కూడా ఉంటుంది.ఆ క్యారెక్టర్ అంత ఎమోషనల్ గా ఉండడానికి గల కారణం తాను కళ్ళతోనే ఫీలింగ్స్ చాలా వరకు వ్యక్తపరచడమేనని వెంకటేష్ ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు.