డ్రై స్కిన్ ను రిపేర్ చేసే చియా సీడ్స్.. ఇలా వాడితే మరిన్ని లాభాలు మీ సొంతం!

డ్రై స్కిన్ మనలో చాలా మందిని కలవర పెట్టే చర్మ సమస్యల్లో ఒకటి.పొడి చర్మం(dry skin) కారణంగా ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది.

 How To Repair Dry Skin With Chia Seeds! Dry Skin, Chia Seeds, Chia Seeds Benefit-TeluguStop.com

నిగారింపు మాయమవుతుంది.డ్రై నెస్ వల్ల చర్మం దురదగా, గరుకుగా మరియు పొరలుగా అనిపిస్తుంది.

ఈ క్రమంలోనే పొడి చర్మాన్ని నివారించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే అలాంటి వారికి చియా సీడ్స్ (Chia seeds)ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ మరియు ఇతర పోషకాలు చర్మం ఆరోగ్యానికి అండగా ఉంటాయి.

Telugu Tips, Chia Seeds, Chiaseeds, Chia Seeds Face, Skin, Latest, Skin Care, Sk

ముఖ్యంగా డ్రై స్కిన్ ను రిపేర్ చేయడం లో చియా సీడ్స్ ఉత్తమంగా సహాయ పడతాయి.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ (Oats)మరియు కొద్దిగా వాటర్ వేసుకుని ఇర‌వై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

ఆ తర్వాత నానబెట్టుకున్న ఓట్స్ మ‌రియు చియా సీడ్స్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Chia Seeds, Chiaseeds, Chia Seeds Face, Skin, Latest, Skin Care, Sk

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె (honey )మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు(curd) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీ స్కిన్ ను హైడ్రేటెడ్ గా మార్చడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది.చియా సీడ్స్, ఓట్స్, తేనె మరియు పెరుగులో ఉండే పలు పోషకాలు చర్మం యొక్క డ్రై నెస్ ను నివారిస్తాయి.

చర్మాన్ని తేమగా కోమలంగా మారుస్తాయి.పైగా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని పాటించడం వల్ల స్కిన్ గ్లోయింగ్ గా మెరుస్తుంది అందంగా మారుతుంది.

కాబ‌ట్టి డ్రై స్కిన్ తో బాధ‌ప‌డుతున్న వారు ఈ చియా సీడ్స్ మాస్క్ ను త‌ప్ప‌క ప్ర‌య‌త్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube