భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆకుకూరల్లో మెంతికూర లేదా మేతి ఆకులు ఒకటి.మెంతికూరలో వివిధ రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్(Vitamins, minerals, antioxidants, fiber, protein) మెండుగా నిండి ఉంటాయి.
అందువల్ల ఆరోగ్య పరంగా మెంతికూర అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి మెంతికూర ఒక సహజ ఔషధమని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే, చక్కెర వ్యాధి (Diabetes)నియంత్రణలో మెంతికూర ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో మెంతికూరను చేర్చుకుంటే బోలెడు లాభాలు పొందుతారు.
మెంతికూర ఇన్సులిన్ (Fenugreek insulin)ప్రభావాన్ని పెంచడంలో తోడ్పడుతుంది.ఇది రక్తంలో గ్లూకోజ్ ఉపయోగాన్ని మెరుగుపరచి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది.
అలాగే మెంతికూరలో ఉండే గ్లైకోమానన్ అనే రేణువులు రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తాయి.ఫలితంగా రక్తం చక్కెర స్థాయులు క్రమబద్ధంగా ఉంటాయి.
మెంతికూరలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.ఇది శరీరంలో రక్తానికి చక్కెర విడుదలను నియంత్రిస్తుంది.డయాబెటిస్(Diabetes)ఉన్న వారికి బరువు నియంత్రణ చాలా కీలకం.అయితే మెంతకూర తక్కువ కేలరీలతో ఉండి, శరీరంలోని ఫ్యాట్‌ను కరిగించే గుణం కలిగి ఉంటాయి.అందువల్ల మెంతికూర బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగకరమైన ఆహారంగా పరిగణించబడతాయి.
మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదరం ఎక్కువగా ఉంటుంది.అయితే మెంత్రికూర చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె సంబంధిత జబ్బుల నుంచి రక్షణ కవచాన్ని కల్పిస్తుంది.అంతేకాదండోయ్.
మెంతికూర ఐరన్‌తో నిండి ఉంటుంది.ఇది హేమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో మరియు రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.
మెంతికూరలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ-ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.మెంతుకూర చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
సో.సమగ్ర ఆరోగ్యం కోసం మెంతికూరను ఆహారంలో చేర్చుకోండి.పప్పు, కూరలు, లేదా సూప్‌ల రూపంలో మెంతికూరను ఆస్వాదించవచ్చు.