పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయ్యింది.పెళ్లిలో ప్రతి ఒక్కరి చూపు వధూవరుల పైనే ఉంటుంది.
జంట ఎలా ఉన్నారు అని చూసేందుకు ప్రతి ఒక్కరు తెగ ఆరాటపడుతుంటారు.ఈ క్రమంలోనే పెళ్లిలో తన ముఖం కళకళ మెరిసిపోతూ కనిపించాలని వధువులు భావిస్తుంటారు.
అయితే అటువంటి చర్మాన్ని పొందడానికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ(Home remedy) చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.కాబోయే పెళ్లి కూతుళ్లు దాదాపు నెల రోజుల ముందు నుంచి ఈ రెమెడీని పాటించడం అలవాటు చేసుకుంటే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ (Skin Care Benefits)మీ సొంతం అవుతాయి.
ఇంకెందుకు లేటు రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఎండిన గులాబీ రేకులు(Rose petals), అర కప్పు ఎండిన ఆరెంజ్ తొక్కలు(dried neem leaves), పది ఎండిన వేపాకులు, నాలుగు ఎండిన తులసి ఆకులు(basil leaves) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పౌడర్ లో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు( organic turmeric) వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.
ఈ మ్యాజికల్ పౌడర్ ను వన్ టేబుల్ స్పూన్ చొప్పున బౌల్ లోకి తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి, మెడకు పూతలా అప్లై చేసుకోవాలి.పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.మూడు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటించారంటే స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
చర్మం పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృత కణాలు తొలగిపోతాయి.చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.మొండి మచ్చలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి.అంతేకాకుండా స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మరియు షైనీ గా మారుతుంది.