సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే అందం అబినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి.ఇవన్నీ ఉన్నప్పుడే మనకు సినిమా అవకాశాలు వస్తాయి.
అయితే సినిమా అవకాశాలు రాగానే సరిపోదు.ఆ అవకాశాన్ని ఎంపిక చేసుకోవడంలో సరైన జడ్మెంట్ ఉండాలి.
చేతికి వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ పోతే కెరియర్ డేంజర్ లో పడటం ఖాయం.అందుకే సినిమాల ఆఫర్లు వచ్చినప్పటికీ సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని చెబుతూ ఉంటారు.
ఇది ఇలా ఉంటే ఈ విషయంలో ప్రస్తుతం రష్మిక మందన జడ్మెంట్ తో ఉందని చెప్పాలి.వరుస సినిమాలలో నటించడంతోపాటు సినిమా కథల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వాటిస్తోంది రష్మిక మందన.( Rashmika Mandanna )

పుష్ప, యానిమల్ సినిమాలతో తన క్రేజ్ నేషనల్ లెవల్ కి పాకింది.ఇప్పుడు తను చేస్తున్న ప్రతి సినిమాకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది.రొటీన్ కమర్షియల్ హీరోయిన్ తరహా పాత్రలకు గుడ్ బై చెప్పేస్తోంది రష్మిక.రాబిన్ హుడ్( Robinhood ) అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి.ఎందుకు అంటే ఈ సినిమాలో మొదట రష్మికనే ఫిక్స్ చేశారు.అంతకుముందు తను నితిన్( Nithin ) వెంకీ కుడుముల( Venky Kudumula ) కాంబినేషన్ లో చేసిన భీష్మ హిట్.
ముందు అదే కాన్ఫిడెన్స్ సినిమా సైన్ చేసింది.అయితే సినిమా తయారౌతున్న తీరు తనకి ఎక్కడో తేడా కొట్టింది.
ముఖ్యంగా తన క్యారెక్టర్ లో బలం లేదనే సంగతి తెలివిగా పసిగట్టింది రష్మిక.డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదనే సాకు చూపి నెమ్మదిగా సైడ్ అయిపొయింది.

పుష్ప మూవీ మేకర్స్ కావడంతో వాళ్ళు కూడా సైలెంట్ గా వేరే ఆప్షన్ చూసుకున్నారు.రష్మిక తప్పుకున్న తర్వాత శ్రీలీల( Sreeleela ) ప్రాజెక్ట్ లో చేరింది.ఇక్కడే శ్రీలీల పాత్రల ఎంపికపై మరోసారి అనుమానం వస్తోంది.అసలు పెర్ఫర్మెన్స్ కి స్కోప్ లేని ఇలాంటి క్యూట్ రోల్స్ ఇప్పటికే చాలా చేసి అపజయాలు ఎదురుకుంది శ్రీ లీల.ఈమె ఒక క్యారెక్టర్ ఒప్పుకుందంటే ఆ కథ చాలా వీక్ గా ఉంటుందనే ముద్ర ఇప్పుడు ఇండస్ట్రీలో పడింది.ఆ సెంటిమెంట్ ని రాబిన్ హుడ్ మరింత బలపరిచింది.
హీరోయిన్ గా ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సినిమా తనకి ఎందుకు రాలేదో నిజంగా శ్రీలీల ఇపుడు సీరియస్ గా అలోచించుకోవాలి.ఇకనైన పాత్రల ఎంపికలో తెలివిగా వుండాలని లేదంటే చాలా కష్టం అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.