ఇంటి ముందు తులసి చెట్టును ఎందుకు పెంచుకోవాలి?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం తులసి చెట్టుకు చాలా విశిష్టత ఉంది.మనకు తెలిసినంత వరకు తులసి కోటను బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు మాత్రమే ఇంటి ముందు పెట్టి ప్రతి నిత్యం నీరు పోసి నమస్కరిస్తుంటారు.

 Why Grow Thulasi Pant Nfront Of The House , Importance Of Tulasi, Thulasi Kota,-TeluguStop.com

జంధ్యపు కులాలకు మాత్రమే ఎందుకు తులసి పరిమితం అయిందో మాత్రం మనకు తెలియదు.కానీ ఈ మధ్య కులాలతో సంబంధం లేకుండా అందరూ తులసి కోటను ఇంట్లో పెట్టుకుంటున్నారు.

పూజలు, వ్రతాలు వంటివి కూడా తరచుగా చేస్తున్నారు.అయితే తులసి వృక్షం ఆయుర్వేద రంగంలో మహత్తర స్థానం సంపాదించుకుంది.

ఎన్నో అనారోగ్యాలకు తులసి దివ్య ఔషధంగా ఉపయోగ పడుతుంది.

తులసి మొక్కను హిందువులు లక్ష్మీ దేవితో సమానంగా చూస్తారు.

అంతేనా పూజలు, వ్రతాలు చేస్తుంటారు.తులసి వృక్షం ఇంటి ముందు ఉంటే ఆ ఇంటికి దరిద్రం రాదని నమ్ముతారు.

ప్రతి నిత్యం తులసిని పూజించే స్త్రీలకు సౌభాగ్యం పది కాలాల పాటు ుచల్లగా ఉంటుందని పతి ప్రేమకు పాత్రులు అవుతారని, తులసీ ప్రదక్షణం చేసే వారికి ఆయుష్షు ఆరోగ్యం లభిస్తాయని భారతీయ స్త్రీ పవిత్ర విశ్వాసం.పసి పాపలు జలుబు, దగ్గు, దురదలను తులసి మొక్క దరి చేరనివ్వదు.

విష్ణుమూర్తికి తులసి మాల అంటే ఎంతో ఇష్టమని వైష్ణవులు విశ్వసిస్తారు.ఎండిన తులసి కొమ్మలను చిన్న చిన్న ముక్కలుగా కోసి పూసలుగా తయారు చేసి మెడలో ధరిస్తారు.

అంతే కాకుండా పలు పర్వ దినాల్లో తులసి చెట్టుకు కల్యాణం, ప్రత్యేక పూజలను కూడా చేస్తుంటారు.ఇలా చేయడం వల్ల మనకు అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube