టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.ఇప్పటి వరకు నటించింది 26 సినిమాలే అయినా బ్లాక్ బస్టర్ హిట్ లు సాధించాడు.వాటిలో కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి.అయితే ప్రిన్స్ తనకు వచ్చిన పలు సూపర్ హిట్ చిత్రాల అవకాశాలను ఆయా కారణాలతో రిజెక్ట్ చేశాడు.ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
యమలీలఆలీ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమా స్టోరీని తొలుత డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి కృష్ణకు వినిపించాడు.
కథ బాగా నచ్చడంతో ఈ సినిమాతో మహేష్ ను ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నాడు.కానీ ఆయన చదువును డిస్టర్బ్ చేయకూడదని సైలెంట్ అయ్యాడు.
దీంతో ఆ సినిమా ఆలీ చేతికి చిక్కి సూపర్ హిట్ అయ్యింది.
నువ్వే కావాలి
యంగ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబుకు.స్రవంతి రవి కిశోర్ ఓ ఆఫర్ ఇచ్చాడు.నువ్వే కావాలి సినిమాకు హీరోగా చేయాలని కోరాడు.
కానీ ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తరుణ్ హీరోగా ఈ సినిమా చేశాడు.మంచి విజయం సాధించాడు.
ఇడియట్
ఈ సినిమా స్టోరీని మహేష్ బాబుతో పాటు మరో నలుగురు హీరోలకు చెప్పాడు పూరీ జగన్నాథ్.ఈ కథలో ప్రేక్షకులు తనను ఆదరించరని మహేష్ బాబు నో చెప్పాడట.ఆతర్వాత ఈ సినిమాను రవితేజతో తీసి సక్సెస్ అయ్యాడు పూరీ.
మనసంతా నువ్వే
మనసంతా నువ్వే సినిమాకు హీరోగా చేయాలని ఎమ్ ఎస్ రాజు మహేష్ ను కోరాడట.ఆ సమయంలో డేట్స్ కుదరక నో చెప్పాడట.ఈ సినిమా ఉదయ్ కిరణ్ తో తీశారు.
ఈ మూవీతో ఉదయ్ కిరణ్ కెరీన్ మలుపు తిప్పింది.
గజిని
ఈ సినిమాలో హీరోగా చేయాలని దర్శకుడు మహేష్ బాబును కోరాడట.తనకు ఈ క్యారెక్టర్ సూట్ కాదని చెప్పాడట ప్రిన్స్.దీంతో ఆయన ప్లేస్ లో సూర్యాతో చేసి విజయం సాధించాడు.
లీడర్
ఈ సినిమా అవకాశం ముందుగా ప్రిన్స్ కే వచ్చింది.కథలో మార్పులు చేయాలని కోరాడు.కానీ అందుకు శేఖర్ కమ్ముల నో చెప్పడంతో మహేష్ కూడా నో చెప్పాడు.
ఏమాయ చేసావే
ఈ సినిమా స్టోరీని గౌతమ్ మీనన్ మహేష్ కోసం రాశాడు.కానీ మహేష్ ఖలేజా సినిమాలో బిజీగా ఉండటంతో కుదరలేదు.
రుద్రమదేవి
ఈసినిమాలలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి క్యారెక్టర్ మొదట మహేష్ కు అవకావం వచ్చింది.కానీ పలు కారణాలతో అందుకు నో చెప్పాడట ప్రిన్స్.
24
ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేయాలని విక్రమ్ కుమార్ మహేష్ కు చెప్పాడట.అయితే తన క్యారెక్టర్ లో మార్పులు చేయాలని కోరాడట.అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో సినిమా క్యాన్సిల్ అయ్యింది.
ఫిదా
ఈ సినిమాను ప్రిన్స్ తో చేయాలనుకున్నాడు శేఖర్ కమ్ముల.కథ కూడా చెప్పాడు.డేట్స్ కుదరక ఈ సినిమాను వదులుకున్నాడు.
గ్యాంగ్ లీడర్
ఈ సినిమా కథను సైతం విక్రమ్ కుమార్ ప్రిన్స్ కే ముందు చెప్పాడు.ఏవో కారణాలు చెప్పి మహేష్ వద్దనుకున్నాడట.
పుష్ప
అల్లు అర్జున్ చేసిన ఈ సినిమాను మహేష్‌తో చేయాలనుకున్నాడట సుకుమార్.కథ కూడా వినిపించాడట.అయితే ఈ సినిమా తనకు సూట్ కాదని మహేష్ చెప్పాడట.