7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం.. మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌ ఇతడే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్ పుణ్యక్షేత్రంలో మహాకుంభమేళా( Mahakumbh Mela ) 2025 అంగరంగ వైభవంగా జరుగుతోంది.ఇది భక్తులతో పోటెత్తింది.

 7-foot-tall Muscular Baba From Russia Grabs Attention At Maha Kumbh Mela 2025 De-TeluguStop.com

భారతీయులే కాకుండా విదేశీయులు, ప్రముఖులు, సాధువులు సైతం ఈ ఆధ్యాత్మిక వేడుకకు తరలివస్తున్నారు.జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.

ఎంతో పవిత్రమైన గంగా, యమునా, సరస్వతి నదుల కలయిక అయిన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు.

ఈ మహా కుంభమేళాలో ఓ ప్రత్యేకమైన సాధువు అందరి దృష్టిని తన వైపే తిప్పుకుంటున్నారు.

ఏకంగా ఏడు అడుగుల ఎత్తుతో కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకుంటున్న ఆయన్ని అందరూ “మస్క్యులర్ బాబా”( Muscular Baba ) అని ముద్దుగా పిలిచేస్తున్నారు.రష్యాన్‌ దేశస్తుడైన ఈ బాబా గురించి ఇప్పుడు వార్తలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సాధారణ కాషాయ వస్త్రాలు ధరించి, మెడలో రుద్రాక్ష మాల, భుజాన చిన్న సంచి వేసుకొని ఉన్న ఆయన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మస్క్యులర్ బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్.( Atma Prem Giri Maharaj ) ఆయన్ని చాలామంది మోడర్న్ పరశురాముడు అని పిలుస్తున్నారు.హిందూ పురాణాల ప్రకారం, పరశురాముడు విష్ణువు ఆరవ అవతారం.

భూమిపై ఉన్న దుష్ట, క్రూర రాజులను అంతమొందించడానికి ఆయన జన్మించాడని అంటారు.వైశాఖ మాసంలో వచ్చే పరశురామ జయంతిని ఆయన జన్మదినంగా జరుపుకుంటారు.

దాదాపు 30 ఏళ్ల క్రితం హిందూ ధర్మం గురించి తెలుసుకున్న ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ అప్పటినుంచి ఆ మార్గాన్నే అనుసరిస్తున్నారు.రష్యాలో( Russia ) టీచర్ కాగా ఇప్పుడు దాన్ని వదులుకొని నేపాల్‌లో హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన అక్కడికి వెళ్లారు.ఒకప్పుడు పైలట్ బాబా శిష్యుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం ప్రముఖ హిందూ సన్యాస సంప్రదాయమైన జూనా అఖాడాలో సభ్యుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube