సినిమాకు హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ చాలా ముఖ్యం.వారు ఇద్దరూ అద్భుతంగా కలిసి నటిస్తేనే సినిమా మంచి హిట్ అవుతుంది.
అందుకే కథకు తగ్గ హీరో, హీరోయిన్లను ఆలోచించి మరీ సెలెక్ట్ చేస్తారు.మంచి అప్పియరెన్స్, యాక్టింగ్ మీద దృష్టి పెట్టి ఓకే చేస్తారు.
అంతే తప్ప వారి వయసును లెక్కలోకి తీసుకోరారు.పలు సినిమాల్లో హీరో కంటే వయసులు పెద్ద అయిన హీరోయిన్లను ఎంపిక చేశారు.
ఇంతకీ తమ కంటే ఏజ్ లో పెద్ద హీరోయిన్లతో జతకట్టిన హీరోలు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం!
అఖిల్ అక్కినేని:
అక్కినేని నాగార్జున కొడుకు తన రెండో సినిమాలోనే వయసులు తన కంటే పెద్ద అయిన హీరోయిన్‌తో రొమాన్స్ చేశాడు.ఈ సినిమాలో తనతో జోడీ కట్టిన కల్యాణి ప్రియదర్శన్.
వయసులో అఖిల్ కంటే రెండేళ్లు పెద్దది .ఈ మూవీలో వారు నటించే సమయానికి అఖిల్ ఏజ్ 23 కాగా.కల్యాణి వయసు 25.అటు మజ్ను మూవీలో నటించిన నిత్య అగర్వాల్, అరని ఇషాబుళ్ల వయస్సు కూడా అఖిల్ కంటే రెండేళ్లు పెద్దవారు.తాజాగా అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలోని హీరోయిన్ పూజా హెగ్డే కూడా అఖిల్ కంటే వయసులో నాలుగు ఏండ్లు పెద్ద.
మహేష్ బాబు:

మహేష్ బాబు తన తొలి చిత్రంలోనే తన కంటే వయసులో పెద్ద అమ్మాయితో నటించాడు.రాకుమారుడు మూవీలో మహేష్ సరసన నటించిన ప్రీతి జింటా వయసు రెండేళ్లు పెద్దది.వంశీ మూవీ హీరోయిన్, తన సతీమణి అయిన నమ్రత కూడా మహేష్ బాబు కంటే నాలుగేళ్లు వయసుల పెద్దది కావడం విశేషం.
ఎన్టీఆర్:

ఎన్టీఆర్‌తో సింహాద్రిలో నటించిన హీరోయిన్ భూమిక వయసు 5 ఏండ్లు ఎక్కువ.ఆ మూవీ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ వయసు 20 కాగా.భూమిక వయసు 25 ఏండ్లు.నరసింహుడు మూవీ హీరోయిన్ అమిషా పటేల్ ఎన్టీఆర్ కంటే 8 ఏండ్లు పెద్ద.అశోక్ మూవీ హీరోయిన్ సమీరారెడ్డి కూడా ఎన్టీఆర్ కంటే 3 ఏండ్లు వయసులో పెద్ద.
శర్వానంద్:

శర్వానంద్ హీరో తెరకెక్కిన అందరి బంధువయ మూవీ హీరోయిన్ పద్మప్రియ వయసు కూడా ఎక్కువే.శర్వానంద్ కంటే ఈ బ్యూటీ ఏజ్ 2 ఏండ్లు ఎక్కువ.
అల్లరి నరేష్:

అల్లరి నరేష్ హీరోగా చేసిన తొట్టి గ్యాంగ్ మూవీ హీరోయిన్ కూడా వయసులో పెద్దది.నరేష్‌తో పోల్చితే అనిత వయసు రెండేళ్లు ఎక్కువ.
నాగచైతన్య:

నాగచైతన్య దడ మూవీ హీరోయిన్ కాజల్ అగర్వాల్.ఆమె తన కంటే కంటే 2 ఏండ్లు వయసులు పెద్ద.
వరుణ్ తేజ:

వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం మూవీ హీరోయిన్ అతిథిరావ్ హైదరీ.3 ఏండ్లు పెద్దది.వరుణ్ మరో మూవీ మిస్టర్ హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా 2 ఏండ్లు పెద్దది.
రాజ్ తరుణ్:

రాజ్ తరుణ్ తో కలిసి రెండు సినిమాల్లో నటించిన హెబ్బా పటేల్ వయసులో 4 ఏండ్లు పెద్దది .
రాంచరణ్:

రాంచరణ్ హీరోగా చేసిన బాలీవుడ్ మూవీ తుఫాను.ఈ మూవీలో తనకు జోడీగా నటించిన ప్రియాంక చోప్రా వయసు 2 ఏండ్లు పెద్ద.
రామ్:

రామ్ తొలి సినిమా దేవదాస్ హీరోయిన్ ఇలియానా వయసులో తన కంటే 2 ఏండ్లు పెద్ద.తన రెండో మూవీ జగడం నటి ఇషా సహని కూడా రామ్ కంటే 4 ఏండ్లు పెద్దది .రెడీ హీరోయిన్ జెనీలియా కూడా రామ్ కంటే 2 ఏండ్లు వయసులో పెద్దది.
బెల్లం కొండ శ్రీనివాస్:

బెల్లంకొండతో కలిసి నటించిన సమంత , పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ వయసులో పెద్దవాళ్లేజ శ్రీనివాస్ కంటే సమంత 5, పూజ హెగ్డే 2, కాజల్ అగర్వాల్ ఏకంగా 7 ఏళ్ళు పెద్దది కావడం విశేషం.