కొన్నిసార్లు మనం అనుకుంటే సరిపోదు.కాలం కూడా కలిసి రావాలి.
అప్పుడే అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి.టాలీవుడ్ హీరోల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది.
ఏడాదికి మూడు సినిమాలు చేస్తామని ప్రకటించినా.కనీసం రెండు మూడేళ్లకు ఒక్క సినిమా కూడా చేయలేకపోతున్నారు.
ఆయా కారణాల మూలంగా చాలా మంది హీరోలు సైతం సినిమాలు చేయలేకపోతున్నారు.సీనియర్ హీరోలు సైతం రెండు మూడు సంవత్సరాలలుగా వెండితెరపై కనిపించడం లేదు.
చిరంజీవి మొదలుకొని బాలయ్య వరకు ఈ లిస్టులో ఉన్నారు.అటు జూనియర్ ఎన్టీఆర్ కనిపించక మూడేండ్లు దాటింది.
రాంచరణ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే.ఇంతకీ రెండేండ్లుగా తెరపై కనిపించని హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
జూనియర్ ఎన్టీఆర్
ఈ నందమూరి యంగ్ హీరో చివరి సినిమా అరవింద సమేత 2018 అక్టోబర్ లో విడుదల అయ్యింది.2022లో ట్రిపుల్ ఆర్ జనాల ముందుకు రాబోతుంది.
రామ్ చరణ్
మెగా హీరో చివరి సినిమా వినయ విధేయ రామ 2019 జనవరిలో రిలీజ్ అయ్యింది.2022లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతుంది.
ప్రభాస్
పాన్ ఇండియన్ హీరో సాహో 20198 ఆగస్టులో విడుదల అయ్యింది.2021లో రాధ శ్యామ్ విడుదలకు సిద్ధం అవుతుంది.
చిరంజీవి
మెగాస్టార్ చివరి సినిమా సైరా 2019 అక్టోబర్ లో విడుదల అయ్యింది.ఆచార్య సినిమా 2021లలో విడుదలకు రెడీ అవుతుంది.
బాలకృష్ణ
ఈయన చివరి సినిమా రూరల్ 2019 డిసెంబర్ లో విడుదల అయ్యింది.తర్వాతి సినిమా అఖండ 2021లో విడుదలకు సిద్ధం అవుతుంది.
వెంకటేష్
వెంకటేష్ లాస్ట్ సినిమా వెంకీమామ 2019 డిసెంబర్ లో విడుదల అయ్యింది.దృశ్యం-2 2021లో విడుదల కానుంది.
నాగ చైతన్య
ఈయన చివరి సినిమా వెంకీమామ 2019 డిసెంబర్ లో వచ్చింది.లవ్ స్టోరీ 2021లలో విడుదల కాబోతుంది.
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ చివరి సినిమా గద్దలకొండ గణేష్ 2019 సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది.ఎఫ్-3 2021లో విడుదల కానుంది.
గోపీచంద్
ఇతడి చివరి సినిమా చాణక్య 2019లో విడుదల అయ్యింది.సీటీమార్, ఆరడుగుల బుల్లెట్, పక్కా కమర్షియల్ 2021లో విడుదల కానున్నాయి.