సోషల్ మీడియా(Social media) యుగంలో ప్రతి చిన్న సంఘటన కూడా ఓ పెద్ద ట్రెండ్‌గా మారిపోతోంది.ముఖ్యంగా విద్యార్థులతో సంబంధమున్న ఫన్నీ లేదా ఆశ్చర్యకర వీడియోలు నెట్టింట్లో వేగంగా వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే తాజాగా ఓ అద్భుత ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.ఇది హర్యానాలోని (Haryana)సోనిపట్‌లో ఉన్న ఓ ప్రముఖ విశ్వవిద్యాలయం ఓపీ జిందాల్ యూనివర్సిటీకి(OP Jindal University) సంబంధించినది.
ఒక యువకుడు బాలుర హాస్టల్‌లోకి తన స్నేహితురాలిని సూట్‌కేస్‌లో దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.ఈ ఘటన హాస్టల్ గార్డుల అప్రమత్తతతో వెలుగులోకి వచ్చింది.అనుమానాస్పదంగా అతను సూట్‌కేస్‌ను తీసుకుని రావడాన్ని గమనించిన సెక్యూరిటీ వారు ఆపి సూట్‌కేస్‌ను ఓపెన్ చేశారు.అప్పుడే అందులో నుంచి ఓ యువతి బయటపడింది.
ఈ దృశ్యం మొత్తం హాస్టల్‌లోని ఇతర విద్యార్థులు కెమెరాలో రికార్డ్ చేయగా, ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తూ మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు.ఈ సంఘటన విద్యార్థుల్లో వినోదానికి తెరలేపినా, ప్రైవసీ, నిబంధనలు, క్రమశిక్షణ వంటి అంశాలపై కూడా ఓ కీలక చర్చకు దారితీస్తోంది.ఇటువంటి విద్యార్థులు ఉండటం వల్లే ప్రస్తుత సమాజం చెడిపోతుందని ఇలాంటి వారిని కాలేజీ నుంచి టిసి ఇచ్చి పంపించేయాలని కొందరు కామెంట్ చేస్తుండగా.
మరికొందరేమో ఫన్నీగా అయ్యయ్యో ఇలా అడ్డంగా బుక్కయ్యారేంటి అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.మరి కొందరేమో అసలు ఇలాంటి ఆలోచన ఎలా తట్టింది బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు.