కొంతమందికి ముఖంపై అవాంఛిత వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి.అవి చాలా సమస్యగా మారుతూ ఉంటాయి.
అంతే కాకుండా ఇవి ముఖ సౌందర్యాన్ని ప్రభావితం చేస్తాయి.దీంతో చాలా మంది వాటిని తొలగించడానికి వివిధ రకాలైన ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే వాటిని తొలగించుకోవడం అంతా సులభం కాదు.అటువంటి పరిస్థితిలో కొన్ని సులువమైన ఇంటి పద్ధతులను ఉపయోగించవచ్చు.
ఇది అవాంఛిత ముఖా రోమాలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి( Papaya ), తేనే ముఖం పై అవాంఛిత రోమాలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇందుకోసం బాగా పండిన బొప్పాయిని మెత్తగా చేసి అందులో కొద్దిగా తేనె లేదా పాలు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.తర్వాత దీన్ని ముఖానికి పట్టించి కాసేపు అలానే ఉంచి తర్వాత బాగా రుద్దాలి.తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే ముఖం పై వెంట్రుకలను దూరం చేసుకోవడానికి చెక్కర, నిమ్మకాయ ఉపయోగించవచ్చు.దీని కోసం కొంచెం పంచదార తీసుకొని అందులో నిమ్మరసం కలపాలి.
కొన్ని చుక్కల నీరు కూడా కలుపుకోవాలి.తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు స్క్రబ్ చేసి కొద్దిసేపటి తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇంకా చెప్పాలంటే ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించడానికి బియ్యం పిండిని కూడా ఉపయోగించవచ్చు.దీనికోసం బియ్యం పిండిలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి మెత్తగా పేస్టులా చేసుకోవాలి.ఈ పేస్టును ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి.ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇంకా చెప్పాలంటే ముఖం పై అవాంఛిత రోమాలను దూరం చేసుకోవడానికి శనగపిండి, పెరుగు సహాయం కూడా తీసుకోవచ్చు.దీనికోసం శనగపిండిలో పెరుగు కలిపి పేస్టులా తయారు చేసి అందులో చిటికెడు పసుపు( Turmeric ) కలపాలి.
తర్వాత ఈ పేస్టును ముఖానికి పట్టించి కాసేపు అలాగే ఉంచాలి.ఇది కొద్దిగా అరిన తరువాత మొదలైన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.







