జుట్టును ఒత్తుగా పెంచే మ్యాజికల్ ఆయిల్ ఇది.. వారానికి 2 సార్లు వాడితే మరెన్నో బెనిఫిట్స్!

జుట్టు రోజురోజుకు విపరీతంగా రాలిపోతుందా.? దాంతో కురులు పలుచ‌గా మారాయా.? మళ్లీ జుట్టును ఎలా ఒత్తుగా మార్చుకోవాలో అర్థం కావడం లేదా.? వర్రీ వద్దు మీకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే జుట్టు ఎంత పలుచగా ఉన్నా సరే ఒత్తుగా మారుతుంది.అలాగే మరెన్నో బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

 Magical Oil For Fast Hair Growth! Magical Hair Oil, Hair Oil, Latest News, Thick-TeluguStop.com

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అరకప్పు ఆలివ్ ఆయిల్( Olive Oil ), అరకప్పు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వక ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, కలోంజి సీడ్స్ పౌడర్ వేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Latest, Long, Magical Oil, Thick-Telugu Healt

అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green Tea Powder ), రెండు రెబ్బల కరివేపాకు, రెండు తుంచిన మందార ఆకులు వేసి కనీసం ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ పై ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గంట పాటు ఆయిల్ ను వదిలేయాలి.ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను తలకు పట్టించి మరుసటి రోజు మైల్ట్‌ షాంపుతో హెయిర్‌ వాష్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Latest, Long, Magical Oil, Thick-Telugu Healt

ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలడం త‌గ్గు ముఖం పడుతుంది.కుదుళ్లు బలోపేతం అవుతాయి.జుట్టుకు మంచి పోషణ అంది.

ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

జుట్టు చిట్లడం, విరగడం వంటివి తగ్గుతాయి.మరియు తెల్ల జుట్టు సమస్య సైతం త్వరగా రాకుండా ఉంటుంది.

కాబట్టి జుట్టును ఒత్తుగా మరియు ఆరోగ్యంగా మార్చుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube