ముఖ్యంగా చెప్పాలంటే అన్నీ మాసాలలోను కార్తీక మాసానికి( Karthika Masam ) ఉండే ప్రత్యేకత వేరు అని దాదాపు చాలా మందికి తెలుసు.అంతే కాకుండా కార్తీక మాసంలో ప్రతిరోజు నిష్ఠతో శివ కేశవులను పూజలు చేస్తే సకల పాపాహరణం జరుగుతుంది అని భక్తురు నమ్ముతారు.
కార్తీక మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో తిరిగే ఉండదని,అలాగే వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు చెబుతున్నారు.మరి ఎలాంటి పనులు చేస్తే కార్తిక మాసంలో శుభం జరుగుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసంలో తెల్లవారు జామున నిద్ర లేచి కార్తీక స్నానాన్ని ఆచరిస్తే శుభం జరుగుతుంది.
కార్తీక స్నానాన్ని( Sacred Bath ) ఆచరించడం వల్ల మనం అంతఃకరణ శుద్ధి కలుగుతుంది.నది స్నానాలు, సముద్ర స్నానాలు చేయడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుందనీ పండితులు చెబుతున్నారు.కార్తీక మాసం అన్ని రోజులు విశిష్టమైన రోజులు కాబట్టి ఆ రోజులకు తగ్గట్టు పూజలను చేయడం శివకేశవులకు( Shiva Keshava ) ఇష్టమైన కార్తీక మాసంలో వారిని ఆరాధించడం వల్ల సత్ఫలితాలను పొందవచ్చు.
దీని వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని కూడా చెబుతున్నారు.కార్తిక దీపారాధనతో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని, దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
కార్తీక మాసం వ్రతాలు ( Vrat ) నిష్టగా ఆచరించడం వల్ల మంచి జరుగుతుందని, కార్తీకమాసంలో సోమవార వ్రతాన్ని, కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని, క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని, లక్ష పత్రి పూజను, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల, వనభోజనం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందవచ్చు.కార్తిక మాసంలో దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు.కార్తీక మాసంలో నువ్వులను దానం చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.
కాబట్టి వారి జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదని, వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని చెబుతున్నారు.కార్తీకమాసంలో చేయవలసిన పనులను తెలుసుకొని దానికి అనుగుణంగా నియమనిష్టలతో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL