జుట్టు కుదుళ్లను బలంగా మార్చి హెయిర్ ఫాల్ ను అరికట్టే మ్యాజికల్ రెమెడీ మీకోసం!

ఆహారపు అలవాట్లు, పోషకాలు కొరత, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం, ఒత్తిడి, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారుతుంటాయి.జుట్టు కుదుళ్లు బలహీనంగా మారే కొద్ది హెయిర్ ఫాల్ సమస్య అనేది తీవ్రతరంగా మారుతుంటుంది.

 This Magical Remedy Helps To Makes Hair Follicles Stronger And Prevents Hair Fal-TeluguStop.com

అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు కుదుళ్ళు బలంగా మారడమే కాదు హెయిర్ ఫాల్‌ సమస్యను సైతం సులభంగా అరిక‌ట్ట‌వ‌చ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో కొబ్బరి పాలు సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, హాఫ్‌ టేబుల్ స్పూన్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Care Tips, Fall, Follicles, Care, Magical Remedy, Silky-Telugu Health

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి.గంట‌న్న‌ర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక‌సారి ఈ మ్యాజికల్ రెమెడీని పాటిస్తే జుట్టు కదుళ్లు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.దాంతో హెయిర్ ఫాల్ సమస్య అనేది క్రమంగా కంట్రోల్ అయిపోతుంది.

Telugu Care Tips, Fall, Follicles, Care, Magical Remedy, Silky-Telugu Health

అలాగే ఈ మ్యాజికల్ రెమెడీని పాటించడం వల్ల స్కాల్ప్ శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది.జుట్టు సిల్కీగా, షైనీ గా సైతం మెరుస్తుంది.సిల్కీ హెయిర్ కావాలని ఆరాటపడే వారికి ఈ రెమెడీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube