జుట్టుకు ముల్తానీ మ‌ట్టి రాస్తే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

ముల్తానీ మ‌ట్టి దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.చాలా మంది త‌మ చ‌ర్మాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకునేందుకు ముల్తానీ మ‌ట్టిని ఉప‌యోగిస్తుంటారు.

 Benefits Of Multani Mitti For Hair Benefits Of Multani Mitti, Multani Mitti For-TeluguStop.com

అయితే ముల్తానీ మ‌ట్టి కేవ‌లం చ‌ర్మానికే కాదు కేశాల‌కు కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.కానీ, ముల్లానీ మ‌ట్టిని ఎలా జుట్టుకు ఉప‌యోగించాలి అన్న‌ది చాలా మందికి తెలియ‌దు.

అలాంటి వారు ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలుసుకుంటే మీ కేశాల‌ను ఆరోగ్యంగా, అందంగా, ఒత్తుగా ఉంచుకోవ‌చ్చు.

ముందుగా ఒక బౌల్‌లో ముల్తానీ మ‌ట్టి, నిమ్మ‌ర‌సం మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు బాగా ప‌ట్టించి అర ‌గంట పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత సాధార‌ణ ష్యాంపూతో త‌ల స్నానం చేయాలి.ఇలా వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల డ్రై హెయిర్ స్మూత్‌గా మారుతుంది.మ‌రియు చుండ్రు స‌మ‌స్య కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.

Telugu Tips, Benefitsmultani, Care, Latest, Multani Mitti-Telugu Health - తె

అలాగే హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో బాధ ప‌డే వారు ఒక బౌల్‌లో ముల్తానీ మ‌ట్టి, ఉసిరి పొడి, ఎగ్ వైట్‌, నిమ్మరసం వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాకు త‌ల‌కు ప‌ట్టించి అర గంట నుంచి గంట పాటు ఆర నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేసేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల హెయిర్ ఫాల్ త‌గ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఇక చిట్లిపోయినా జుట్టును నివారించ‌డంలోనూ ముల్తానీ మ‌ట్టి స‌హాయ‌ప‌డుతుంది.ముల్తానీ మ‌ట్టి, పాలు రెండిటిని మిక్స్ చేసుకుని త‌ల‌కు, కేశాల‌కు అప్లై చేయాలి.

గంట పాటు అలా వ‌దిలేసి ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా చేస్తే చిట్లిన జుట్టు నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube