ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పోషకాల కొరత తదితర కారణాల వల్ల చాలా మందిలో హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంటుంది.దీని కారణంగా ఊడే జుట్టు ఊడిపోతుంటుంది.
కానీ కొత్త జుట్టు రాదు.ఫలితంగా ఒత్తుగా ఉండాల్సిన కురులు పల్చగా మారిపోతుంటాయి.
ఇలా మీకు కూడా జరుగుతుందా.? అయితే అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ ఆయిల్ ను కనుక వాడితే మీ హెయిర్ గ్రోత్ డబుల్ కాదు ట్రిపుల్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలి.
చివరిగా ఒక గ్లాస్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్ బాయిలర్ మెథడ్ లో కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు హీట్ చేయాలి.

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ జుట్టు కుదళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు మైల్డ్ షాంపుతో హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండంటే రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
వైట్ హెయిర్ సైతం త్వరగా దరి చేరకుండా ఉంటుంది.కాబట్టి తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
హెయిర్ గ్రోత్ ను ట్రిపుల్ చేసుకోండి.