1.పంజాబ్ లో భూకంపం
పంజాబ్లో వరుసగా భూప్రకంపనాలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా పంజాబ్ లోని అమృత్ సర్ లో భూకంపం సంబంధించింది.రిక్టార్ స్కేల్ పై 4.1 గా దీని తీవ్రత నమోదయింది.
2.జవహర్ లాల్ నెహ్రూ జయంతి
ఈరోజు మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
3.నేడు విజయనగరం జిల్లాకు రానున్న డిజిపి
నేడు విజయనగరం జిల్లాకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రానున్నారు.
4.టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మహా దీపోత్సవం
విశాఖలోని ఆర్కే బీచ్ లో నేడు టిటిడి ఆధ్వర్యంలో కార్తీకమాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
5.అనంత బాబు బెయిల్ పిటిషన్ విచారణ
నేడు ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు లో నేడు విచారణ జరగనుంది.
6.ఇండోనేషియా కు ప్రధాని
నేడు ప్రధాని నరేంద్ర మోది జీ 20 సమ్మిట్ లో పాల్గొనేందుకు ఇండోనేషియా వెళ్లనున్నారు.
7.గ్రంధాలయ వారోత్సవాలు
నేడు విశాఖ లో vmrda చిల్డ్రన్ ఏరినా లో 55 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు, బుక్ ఎగ్జిబిషన్ ప్రారారంబించనున్న మంత్రి అమర్నాథ్.
8.జగన్ రెడ్డి కాదు బటన్ రెడ్డి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత కామెంట్ చేశారు.జగన్ రెడ్డి కాదు బటన్ రెడ్డి అంటూ విమర్శలు చేశారు.
9.తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం పడుతోంది.
10.వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్ధీ
సోమవారం పురస్కరించుకుని వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు.
11.బీజేపీ శిక్షణా తరగతులు
ఈ నెల 21,22 తేదీల్లో తెలంగాణ బీజేపీ నేతలకు శిక్షణ తరగతులను ఆ పార్టీ ఏర్పాటు చేసింది.ఈ శిక్షణ తరగతులకు అనేక మంది జాతీయస్థాయి నాయకులు హాజరుకానున్నారు.
12.ట్రేడ్ లైసెన్స్ ల పై ప్రత్యేక డ్రైవ్
మహా నగరంలో అనుమతులు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న సంస్థలపై ఉక్కుపాదం మోపాలని జీహెచ్ ఎంసీ నిర్ణయించింది.ఈ మేరకు ట్రేడ్ లైసెన్స్ ల జారీ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది.
13.ఎమ్మెల్యేలకు కొనుగోలు వ్యవహారంలో మరిన్ని అరెస్టులు
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారంలో మరిన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ మేరకు ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న పలువురు పేర్లను పోలీసులు ఈకేసులో నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.
14.షర్మిల పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను పెద్దపల్లి జిల్లాలో అడ్డుకునేందుకు టిఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి.
15.విజయ్ సాయికి నార్కో టెస్టులు జరపాలి
దోచుకోవడంలో ఆరితేరిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డిని అరెస్టు చేసి ఆయనకు నార్కో టెస్టులు జరపాలని టీడీపీ కీలక నేత బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు.
16.జగనన్న లేఅవుట్లలో భారీ స్కాం
జగనన్న లేఅవుట్ లో భారీ స్టాంప్ జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
17.ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం , ఉప్పలపాడు గ్రామంలో దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి అవమానం జరిగింది.విగ్రహానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బూట్లు కట్టడం తో ఉద్రిక్తత నెలకొంది.
18.జగన్ మాట తప్పారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వారంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ హామీ ఇచ్చిన వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మాట తప్పారని టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు.
19.బాలల దినోత్సవం శుభాకాంక్షలు : జగన్
నేడు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,260 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -52,640
.