దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రేమించిన అమ్మాయిని అతి కిరాతకంగా చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు ఓ యువకుడు.
ప్రియురాలి మృతదేహాన్ని మొత్తం 35 ముక్కలుగా చేసిన అఫ్తాబ్ పూనావాలా అనే కిరాతకుడు.అనంతరం ఆ ముక్కలను ఢిల్లీ సమీప అడవుల్లో పడేసినట్లుగా గుర్తించారు.
అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు.ఈ క్రమంలో పెళ్లి చేసుకోమని శ్రద్ధ ఒత్తిడి చేయడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు.
మే నెలలో హత్యకు పాల్పడిన అఫ్తాబ్ శ్రద్ధ మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిజ్ లో ఉంచాడని పోలీసులు విచారణలో తెలిపారు.అర్ధరాత్రి సమయాల్లో ముక్కలను అడవుల్లో పడేసేవాడని పేర్కొన్నారు.
సుమారు 18 రోజులపాటు ఈ విధంగానే చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు.నెలల తరబడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో శ్రద్ధ తల్లిదండ్రులకు అనుమానం కలిగింది.
దాంతో ఈనెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.