కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ.. డిప్యూటీ సీఎంపై మాజీ సీఎం హాట్ కామెంట్స్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan )తీవ్ర విమర్శలు చేశారు.తాడేపల్లిలోని తన ఆఫీసులో మీడియాతో మాట్లాడిన జగన్, ఈ బడ్జెట్ మొత్తం “ఆత్మస్థుతి, పరనింద” అనే రెండు అంశాలతో నిండిపోయిందని పేర్కొన్నారు.

 Former Cm's Hot Comments On Deputy Cm More For Corporator, Less For Mla, Ap Budg-TeluguStop.com

చంద్రబాబు( Chandrababu ) సర్కారు తమ ప్రభుత్వం చేసిన పనులనే గొప్పగా చెప్పుకుంటూ.ప్రతిదానికి తమ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుందని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హమీలు ఇంకా నెరవేర్చలేదని జగన్ మండిపడ్డారు.ప్రత్యేకంగా “సూపర్ సిక్స్”( Super Six ) పేరుతో ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ ఎక్కడికో ఎగిరిపోయాయని విమర్శించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, బీజేపీ నాయకులపై కేసులు పెట్టి, వారి నోళ్లను మూయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి, వాస్తవానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని జగన్ ఆరోపించారు.అలాగే, రైతులకు సంవత్సరానికి రూ.20,000 ఇస్తామని చెప్పి, పీఎం కిసాన్ పథకానికి ( PM Kisan Scheme )సంబంధించిన సాయాన్ని కూడా ఇవ్వలేదని విమర్శించారు.50 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ.45,000 ఇస్తామని చెప్పి, అది కూడా అమలు చేయలేదని తెలిపారు.సామాజిక ఆర్థిక సర్వేలో 27 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చేశామని ప్రభుత్వం పేర్కొన్నదాన్ని జగన్ తప్పుబట్టారు.గతంలో తమ సర్కారు లక్షా 30 వేల మందికి, గ్రామ వాలంటీర్లుగా రెండు లక్షలకు పైగా, అప్కాస్ ద్వారా 90 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు.

ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP Deputy CM Pawan Kalyan )”కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ” అనే స్థాయిలో వ్యవహరిస్తున్నారని.మొదటి సారి గెలిచినందుకు ఎగిరిపడుతున్నారని జగన్ సెటైర్లు వేశారు.గతంలో పవన్, జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో అపోసిషన్ హోదా రాదని.జర్మనీలో వస్తుందని అన్న వ్యాఖ్యలపై జగన్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలు అవుతాయి.బడ్జెట్‌పై, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వానికి ఆచరణాత్మక సమాధానాలు చెప్పాల్సిన సమయం వచ్చింది.

వచ్చే రోజుల్లో ఈ విమర్శలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube