వయసు పైబడిన కూడా యవ్వనంగా కనిపించాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.కానీ నేటి రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, చర్మ సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది పాతిక ముప్పై ఏళ్లకే ముసలి వారిగా కనిపిస్తున్నారు.
ఈ జాబితాలో మీరు ఉండకూడదంటే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని ఫాలో అవ్వండి.ఈ రెమెడీని పాటిస్తే 40 దాటినా కూడా యవ్వనంగా కనిపిస్తారు.
అందుకోసం ముందుగా ఒక బంగాళదుంప( potato ) తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, రెండు బిర్యానీ ఆకులు( Two biryani leaves ) మరియు ఒక కప్పు వాటర్ పోసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో ఉడికించిన పదార్థాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి వస్త్రం సహాయంతో స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ క్రీమ్ లో ఒక ఎగ్ వైట్( Egg white ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్( Vitamin E oil ), వన్ టేబుల్ స్పూన్ హనీ ( Honey )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటించారంటే అదిరిపోయే లాభాలు మీ సొంతమవుతాయి.

ఈ రెమెడీ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.ఒకవేళ చర్మం పై ముడతలు, చారలు ఉంటే వాటిని క్రమంగా మాయం చేస్తుంది.సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.ఈ రెమెడీని పాటిస్తే 40 దాటినా కూడా మీరు యవ్వనంగా కనిపిస్తారు.అందంగా మెరిసిపోతారు.కాబట్టి వయసును దాచేయాలి అనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న మ్యాజికల్ రెమెడీని ఫాలో అవ్వండి.