మన ఇంట్లోనీ వంట గదిలో ఉండే చాలా రకాల ఆహార పదార్థాలతో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే వంటగదిలో ఎక్కువగా కనిపించే వాటిలలో కొత్తిమీర( Coriander ) కూడా ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ కొత్తిమీర ఆహారం రుచిని రెట్టింపు చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది.అందుకే భారతీయులు ఏ కూర చేసినా ఖచ్చితంగా కొత్తిమీరను ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే కూరల్లో కొత్తిమీరను ఉపయోగించిన చాలామంది కరివేపాకు( Curry Leaves ) తీసేసినట్లు కొత్తిమీరను కూడా తీసి పక్కకు పారిస్తూ ఉంటారు.
కొత్తిమీర ను తినడానికి చాలామంది ఇష్టపడరు.
అయితే కొత్తిమీర ను వివిధ రకాల కూరల్లో లేదా చట్నీ చేసుకొని తింటే మంచిది.రుచితో పాటు యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు విటమిన్ ఏ, సి, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.
కొత్తిమీరలోని యాంటీ బయోటిక్ మూలకాలు రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి ఇన్సులిన్ ( Insulin ) ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

ఈ కారణంగా కొత్తిమీర జ్యూస్ పరిగడుపున తాగితే మధుమేహం అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే కొత్తిమీర రసంలో కొంచెం చక్కెర, నీరు కలిపి ఖాళీ కడుపుతో వారం రోజులపాటు క్రమం తప్పకుండా తాగడం వల్ల అలసట, నిస్సత్తువలు దూరమైపోతాయి.లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్బిక్ యాసిడ్స్ వంటివి కొత్తిమీరలో ఎక్కువగా ఉంటాయి.
ఇవి గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తాయి.

ప్రతిరోజు కొత్తిమీర తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అంతేకాకుండా కాలేయం పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది.
తరచూ కొత్తిమీర చట్నీ తినడం వల్ల లేదా ధనియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది.