వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది.అదే సమయంలో ప్రతి గ్రహం దాని సొంత నిర్ణయిత సమయంలోనే ప్రయాణిస్తుంది.
ఇక ఫిబ్రవరి 20న ఐదు రోజుల తర్వాత, గ్రహాల యువరాజు బుధుడు శని రాశి చక్రం, సైన్ కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.ఇలాంటి పరిస్థితుల్లో మెర్క్యూరీ( Mercury ) యొక్క ఈ సంచారం కొన్ని రాశి చక్ర గుర్తులకు చాలా మంచిదని చెబుతున్నారు.
బుధుడు, కుంభ రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశులకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి.బుధుడు వ్యాపార వృత్తికి లాభదాయకంగా పరిగణించబడుతాడు.ఒక వ్యక్తి జాతకంలో బుధుడు బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తి వృత్తి, వ్యాపారలను చాలా విజయాలను చవిచూస్తాడు.కుంభరాశిలోకి ప్రవేశించడం వలన ఏ రాశి వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభం:

ఈ రాశి వారికి ఐదవ ఇంట్లో బుధ సంచారం జరగబోతుంది.కుంభ రాశిలో( Aquarius ) బుధుడు సంచరించడం వలన ఆదాయం పెరుగుతుంది.ఇక డబ్బు సంపాదించడమే కాకుండా పొదుపు కూడా చేస్తారు.విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.ప్రమోషన్, ప్రశంసలు కూడా పొందుతారు.
మిధున రాశి:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశిలో బుధుడు సంచారం చేయడం వలన ఈ రాశి వారికి అదృష్టాన్ని పెంచుతుంది.ఈ సమయంలో మిధున రాశి( Gemini ) వారికి శుభవార్తలు కూడా అందుతాయి.కార్యాలయంలో సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది.
దీంతో కుటుంబంలో ఆనందం నిలుస్తుంది.మంచి జాబ్ ఆఫర్ కూడా రావచ్చు.
సింహరాశి:

బుధుడు సింహరాశిలోని( Leo ) ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు.ఇలాంటి సమయంలో భాగస్వామ్యానికి సంబంధించిన పనిలో విజయం సాధిస్తారు.జీవితంలో అంతా బానే ఉంటుంది.పనితీరు అద్భుతంగా ఉంటుంది.ఇక కార్యాలయంలో మద్దతు లభిస్తుంది.ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తమ సొంత గుర్తింపును సృష్టించుకుంటారు.అలాగే సీనియర్లు వీరి మాట వింటారు.
DEVOTIONAL