శమీ పూజ ప్రాముఖ్యత ఏమిటి.. శమీ పూజను ఎప్పుడూ జరుపుకోవాలంటే..!

ముఖ్యంగా చెప్పాలంటే గత రెండు సంవత్సరాలుగా హిందువుల పండుగలు జరుపుకోవడంలో గందరగోళం ఏర్పడుతూ ఉంది.పండుగ తిధులు రెండు రోజులుగా రావడంతో ఈ తికమక ఏర్పడుతూ ఉంటుంది.

 What Is The Importance Of Shami Puja.. To Always Celebrate Shami Puja , Shami Po-TeluguStop.com

రాఖీ,వినాయక చవితి వంటి పండుగలు మాత్రమే కాకుండా ఇప్పుడు హిందువుల అతి పెద్ద పండుగలలో ఒకటైన దసరా పండుగ ( Dasara Festival )విషయంలో కూడా అయోమయం ఏర్పడింది.ఈ ఏడాది కూడా విజయదశమి ఏ రోజు జరుపుకోవాలనే విషయంలో గందరగోళం ఏర్పడింది.

కొందరు ఈ నెల 23వ తేదీ సోమవారం జరుపుకోవాల లేదా అక్టోబర్ 24వ తేదీన మంగళవారం జరుపుకోవాలనే అయోమయం ఏర్పడింది.ధర్మశాస్త్ర గ్రంధాల ప్రకారం విజయదశమి( Vijayadashami ) 23వ తేదీ సోమవారం జరుపుకోవాలని చెబుతున్నారు.

Telugu Bhakti, Dasara Festival, Devotional, Hindu Festivals, Rakhi, Shami Pooja,

విజయదశమి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయం పై గందరగోళ పరిస్థితులకు తెరదించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందువులు దశమితో కూడిన శ్రావణ నక్షత్రంలో జరుపుకుంటారు.విజయదశమి పండుగను ఈ శ్రావణ నక్షత్రం ఉన్న సమయంలోనే శమీ పూజను జరుపుతారు.నవరాత్రుల తర్వాత పదవ రోజున విజయ దశమిలో జరుపుకునే శమీ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

శ్రవణ నక్షత్రం ఆదివారం సాయంత్రం మూడు గంటల 35 నిమిషములకు వచ్చి సోమవారం సాయంత్రం మూడు గంటల 35 నిమిషముల వరకు ఉంటుంది.మంగళవారం రోజున ధనిష్ట నక్షత్రం వస్తుంది.

ధనిష్ట నక్షత్రం( Dhanishta Nakshatra )లో విజయ దశమి పండుగ జరుపుకోవడం శాసన విరుద్ధమని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Dasara Festival, Devotional, Hindu Festivals, Rakhi, Shami Pooja,

ఈ నేపథ్యంలో సోమవారం రోజున అపర్ణ ముహూర్తంలో దశమి పగలు రెండు గంటల 29 నిమిషముల వరకు ఉంటుంది.అలాగే అపర్ణ కాలము పగలు ఒకటి నుంచి మధ్యాహ్నం మూడు గంటల 28 నిమిషముల వరకు ఉంటుంది.ఈ సమయంలో శ్రావణ నక్షత్రంలో దశమి కలిస్తే అది విజయదశమి అవుతుంది.

కాబట్టి దశమి శ్రావణ నక్షత్రం కలిసి 23వ తేదీ సోమవారం దశమీ పండుగ శమీ పూజ జరుపుకోవాలని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube