ఈ ఏడాది మహాశివరాత్రి వ్రతాన్ని అనుసరించేవారికి ఎంతో ప్రత్యేకం కానుంది.మోక్షపురి కాశీలో కొలువైన విశ్వనాథుని కళ్యాణం ఈ ఏడాది స్వర్ణమండిత మండపంలో వైభవంగా జరగనుంది.
నూతనంగా రూపుదిద్దుకున్న దివ్యమైన శ్రీకాశీ విశ్వనాథుని ధామం పూర్తిగా 60 కిలోల బంగారంతో పూతను సంతరించుకుంది.ఈ రోజు జరగబోతున్న మహాశివరాత్రి వేడుకలు (ఫిబ్రవరి 18 న) విశ్వనాథుడు, పార్వతీ అమ్మవారు కొలువైవుండగా కొత్తగా నిర్మించిన ధామంలో బంగారు వెలుగు జిలుగుల మధ్య జరగనున్నాయి.
శివరాత్రి నాడు రాత్రంతా వేడుకల వాతావరణం నెలకొంటుంది.భక్తులు సమర్పించిన 60 కిలోల బంగారంతో నిజానికి 1835 సంవత్సరంలో మహారాజా రంజిత్ సింగ్ కాశీ ఆలయ గోపురాన్ని బంగారు తాపడంతొ తయారు చేయించారు.
అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌కు ప్రధానమంత్రి తన కలల ప్రాజెక్టుకు పొడిగింపు బాధ్యతను అప్పగించడంతో ఈసారి విశ్వనాథుని కళ్యాణోత్సవం ఎంతో ప్రత్యేకం కానుంది.కాశీ విశ్వనాథుని ధామాన్ని 2021 డిసెంబరు 13న ప్రధానమంత్రి ప్రారంభించారు.
అనంతర కాలంలో మహాశివునికి భక్తుల నుంచి విరాళాల రూపంలో 60 కిలోల బంగారం లభించింది.ఈ బంగారాన్ని గర్భగుడితోపాటు దానివెలుపలి గోడకు తాపడం చేయించారు.
దీంతో ఇప్పుడు తొలిసారిగా ఈ బంగారు గర్భగుడిలో భక్తులు బాబా కళ్యాణోత్సవాన్ని జరుపుకోనున్నారు.అధిక సంఖ్యలో తరలిరానున్న భక్తులు దేవాధిదేవుడు, మహాదేవుడు శంకరుడు కాశీలో నివసిస్తుంటాడని చెబుతారు.

శంకరుని త్రిశూలం మీద ఈ కాశీ కొలువైవుందని కూడా అంటారు.మహాశివుని కళ్యాణాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుండి శివ భక్తులు పెద్ద సంఖ్యలో కాశీకి వస్తారని అధికారులు భావిస్తున్నారు.ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.మహాశివరాత్రి నాడు భక్తులు గంగాద్వార్‌కు వెళ్లి దర్శనం చేసుకోవచ్చని కాశీ విశ్వనాథ ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి సునీల్ వర్మ తెలిపారు.
భక్తుల సంఖ్యను అంచనా వేయడంతో పాటు రోడ్లపై బారికేడింగ్‌లు ఏర్పాటు చేయడంతో భక్తులు క్యూలో నిల్చుని సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

24 గంటలపాటు ఆలయం తెరిచి ఉంటుందిఈసారి కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ ప్రవేశ ద్వారం నుండి రెడ్ కార్పెట్ వేసి మహాదేవుని భక్తులకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసింది.శివరాత్రి సందర్భంగా ఆలయం 24 గంటల పాటు తెరిచి ఉంటుంది, తద్వారా భక్తులు మహాదేవుని దర్శనం నిరంతరం చేసుకోవచ్చు.మహాదేవునికి నాలుగుసార్లు రుద్రాభిషేకం చేయనున్నారు.
అబీర్ గులాల్‌ను కూడా మహాదేవునికి సంప్రదాయ పద్ధతిలో సమర్పించనున్నారు.బంగారు గర్భగుడిలో మహాశివరాత్రి ఉత్సవాలు జరగడం ఇదే తొలిసారి.
సుదూర ప్రాంతాల నుంచి మహాదేవుని భక్తులు ఇక్కడికి చేరుకోవడంతో కాశీవాసుల ఉత్సాహం రెట్టింపయ్యింది.తమకు అన్ని పండుగల కంటే శివరాత్రి పర్వదిన చాలా గొప్పదని వారు అంటున్నారు.