ఏ దేవుడిని పూజిస్తే.. ఏ ఫలితం ఉంటుంది?

హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు.అయితే మనం సందర్భానుసారంగా ఒక్కే దేవుడిని పూజిస్తాం.

 What Will Be The Result have Which God Worshipped, Pooja , Devotioanal , Mahavi-TeluguStop.com

డబ్బులు కావాలంటే లక్ష్మీ దేవిని.ధైర్యం కావాలంటే ఆంజనేయ స్వామిని ఇలా మనకు కావాల్సిన దాన్ని బట్టి వేర్వేరు దేవుళ్లను పూజిస్తుంటాం.అయితే మనకు కొన్ని దేవుళ్ల గురించి మాత్రమే తెలుస్తుంది.అయితే ఏ దేవుడిని పూజిస్తే ఏ ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.శివుడిని పూజిస్తే… ఆయుర్దాయం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.అలాగే శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది.

విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే విద్యతో పాటు యత్న కార్య సిద్ధి వస్తుంది.అలాగే లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ధనధాన్య సిద్ధి, శుభ సంతోషాలు వస్తాయి.

అలాగే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల బలంతో పాటు నిర్భయత్నం, కార్యసిద్ధి లభిస్తుంది.

అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అభీష్ట సిద్ధి కల్గుతుంది.

అలాగే దక్షిణామూర్తికి పూజ చేయడం వల్ల మేధస్సు, జ్ఞానం, యశస్సు సిద్ధిస్తుంది.అలాగే సూర్యుడిని పూజించడం వల్ల ఆరోగ్యం, కీర్తి వస్తుంది.

చంద్రుడికి పూజ చేయడం వల్ల మనశ్శాంతితో పాటు సత్స్వభావం, ధన ధాన్య వృద్ధి సిద్ధిస్తుంది.కుజుడుని పూజించడం వల్ల ధైర్యం, శత్రుజయం, రుణ విమోచనం కల్గుతుంది.

బుధుడిని పూజిచడం వల్ల బుద్ధి కుశలత, బంధు మిత్రత, వ్యాపార వృద్ధి కల్గుతుంది.గురుడుని పూజించడం వల్ల ధనం, విద్య, గౌరవం, కుటుంబ వృద్ధి, శుభ కార్యసిద్ధి సువర్ణ లాబం కల్గుతుంది.

శుక్రుడికి పూజ చేయడం వల్ల సుఖదాంపత్యం, భోగ భాగ్యాలు కల్గుతాయి.శనికి పూజ చేయడం వల్ల ఆయుర్దాయం, కార్యానుకూలత, పీడల నుంచి విముక్తి లభిస్తుంది.

రాహువుని పూజించడం వల్ల దారిద్ర్యబాధా నివారణ, అదృష్ట భాగ్యం లభిస్తుంది.కేతువుకు పూజ చేయడం వల్ల చోర, అగ్ని పైశాచిక బాధల నివారణ, జ్ఞాన  వృద్ధి, మంత్ర సిద్ధి, పుణ్య తీర్థ సేవనం కల్గుతుంది.

అంతే కాకుండా ఏలినాటి శని తొలుగుటకు శ్రీ మహా విష్ణు సహాస్ర నామాలను పఠించడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube