గత నాలుగు ఐదు రోజులుగా సోషల్ మీడియాలో వైసీపీ మంత్రి రోజా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు పేర్లు మారుమోగుతున్న విషయం తెలుసిందే.వైసీపీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటుగా మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్స్ గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
దాంతో మెగా బ్రదర్ నాగబాబు రోజా కి కౌంటర్ ఇస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
మళ్లీ రోజా వెంటనే నాగబాబు పై కౌంటర్ వేసింది.
ఇలా కొద్ది రోజులుగా రోజా వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్న విధంగా వార్తలు నడుస్తున్నాయి.ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు కౌంటర్లు వేసుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ రోజా వ్యాఖ్యలపై స్పందిస్తూ రోజా పై మండి పడిన విషయం తెలిసిందే.రోజా ని డైమండ్ రాణి అని అంటూ పవన్ వాక్యలు చేశారు.
ఇది ఇలా ఉంటే ఈ వివాదంలోకి సంచలన దర్శకుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల దూర్చాడు.

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ వేశాడు.ఈ సందర్భంగా మంత్రి రోజాను డైమండ్ రాణి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ కౌంటర్ ఇస్తూ.డైమండ్ రాణి అనే బిరుదుతో ఒక ఆవిడను కించపరిచిన వ్యక్తికి తను కూడా ఒక ఇస్పేట్ రాజా అన్న విషయం తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలి.
ఈ విషయం తెలుసుకోవాలి అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కోరుకుంటున్నాను అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

ఈ ట్విట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్ అభిమానులు రాంగోపాల్ వర్మ పై ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ రోజా పవన్ విమర్శలు చేసుకుంటే మధ్యలో నీకేంటి అంటూ కామెంట్స్ చేశారు.పవన్ కళ్యాణ్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నావు తెలిసిందే.







