ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంటే తిరుమల అనే చెప్పాలి.తిరుమలలో ఎన్నో మహిమాన్విత ప్రదేశాలు ఉన్నాయి.
అందులో కుమారధార తీర్థంది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పాలి.తిరుమల శేషాచలా అడవుల్లోని పుణ్యతీర్థాలలో ఒకటైన ముక్కోటిని ఈ ఏడాది మార్చి ఏడవ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు.
అయితే కుమార ధార తీర్థానికి ఒక చరిత్ర ఉంది.ఆ చరిత్ర కారణంగా ఆ రోజున భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వస్తారు.

స్నానం చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తారు.కుమార ధార తీర్థానికి సంబంధించిన వరాహ, మార్కండేయ, పద్మ పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి.అందుకే ఇప్పుడు తిరుమలలో ఈ తీర్థం దగ్గర భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు.పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలోని శేషాచల అడవుల్లో ఈ పుణ్యతీర్ధం ఉంది.అయితే ఇక్కడికి ప్రతి ఏడాది వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది.
ఈసారి మార్చి 7వ తేదీన తీర్థ ముక్కోటిని నిర్వహించనున్నారు.
ఈ పుణ్యతీర్దానికి సంబంధించి ప్రధాన ఒక కథ ప్రచారంలో ఉంది.అయితే వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరిలో ఒంటరిగా సంచరిస్తూ ఉన్నాడు.
ఆ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఈ వయస్సులో చెవులు వినిపించవు.కళ్ళు కనిపించవు.
ఈ అడవిలో ఏం చేస్తున్నావని ప్రశ్నించారు.అప్పుడు ఆ వృద్ధుడు తాను యజ్ఞ యాగాలు ఆచరించి దైవ రుణం తీర్చుకోవాలని తలంపుతో ఉన్నాడని స్వామివారికి చెప్పాడు.

అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడిని సలహా ఇచ్చారని.ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు.అలా ముసలి వయసులో ఉన్న ఆయన కామర్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.అందుకే కుమార ధార తీర్థంలో స్నానం చేసి తమ శక్తి మేరకు దానాలు చేసిన వారికి మంచి జరుగుతుందని అలాగే ఉత్తమగతులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
అందుకే కుమార తీర్థ ముక్కోటికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.అక్కడికి వచ్చి తీర్థంలో స్నానం ఆచరించేందుకు ప్రాధాన్యత చూపిస్తారు.
DEVOTIONAL