రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

కేరళలో ఉన్న శబరిమల ఆలయం( Sabarimala )లో నెలకొన్న భక్తుల రద్దీ నిర్వహణ లోపం కారణంగా ఈసారి ఆలయం వార్తల్లో నిలిచింది.అయితే హిందువుల పవిత్ర క్షేత్రంలో శబరిమల ఒకటి.

 Sabarimala Was Formed In The Name Of Sabari, A Devotee Of Rama.. What Is The Spe-TeluguStop.com

శివకేశవుల తనయుడు అయ్యప్ప దీక్షను చేపట్టిన భక్తులు ఏడాది ఏడాదికి పెరిగిపోతూ ఉన్నారు.అయితే అయ్యప్ప దీక్షను చేపట్టి ఆలయానికి చేరుకుంటూ ఉంటారు భక్తులు.

కాబట్టి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏడాది పొడవునా వేలాదిమంది ఈ ఆలయానికి వచ్చి వెళుతుంటారు.ఈ ఆలయం 800 సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణించబడుతుంది.

Telugu Ayyappa Temple, Devotees, Devotional, Lord Rama, Lord Shiva, Lord Vishnu,

అయితే అయ్యప్ప దర్శనం కోసం దేశ విదేశాల నుండి ఏడాది పొడవున భక్తులు వస్తూ ఉంటారు.ఈ ఆలయాన్ని దేశంలోనే అత్యంత ప్రసిద్ధ అయ్యప్ప దేవాలయం( Ayyappa Temple )గా పిలుస్తారు.ఎందుకు పిలుస్తారో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.శబరిమల ఆలయ చరిత్ర రామాయణ కాలంతో ముడిపడి ఉంది.అయితే రామాయణ కథలో శబరిమల ఆలయానికి శబరి పేరుతో ఏర్పడిందని, శ్రీరాముడు తన భక్తురాలైన శబరి ఎంగిలి చేసి ఇచ్చిన పండులను తిన్నాడని పురాణాల్లో పేర్కొనడం జరిగింది.

Telugu Ayyappa Temple, Devotees, Devotional, Lord Rama, Lord Shiva, Lord Vishnu,

శివుడు, విష్ణువుల తనయుడు అయ్యప్ప కాబట్టి ఈ ఆలయం ప్రాచీనమైన రామాయణ( Ramayana ) కాలానికి చెందినది అని ఆలయ చరిత్ర చెబుతోంది.అయితే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తలపై ఇరు ముడితో ఆలయానికి చేరుకుంటూ ఉంటారు.అందులో అయ్యప్పకు సమర్పించే వస్తువులు ఉంటాయి.

అయ్యప్పను దర్శించుకుంటే తమ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తులు నమ్ముతారు.శబరిమల ఆలయంలో ప్రతి సంవత్సరం మకర విలక్కు అంటే మండల దీక్ష, మకర సంక్రాంతిని ఘనంగా జరుపుతారు.

మండల దీక్ష చేపట్టిన భక్తులు సుదూర ప్రాంతాల నుండి అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు చేరుకుంటారు.అలాగే ఈ పండుగ సందర్భంగా ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఇక మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామిని కొత్త బట్టలు, నగలతో అలంకరిస్తారు.అలాగే భక్తులు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు.

ఇక కేరళ ప్రజలకు మకర పండుగ ఒక విశిష్టమైన వేడుకగా జరుపుకుంటారు.ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా మకర సంక్రాంతి వేడుకను అక్కడి ప్రజలు జరుపుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube