పొగబాంబు దాడి ఘటనపై లోక్ సభ చర్యలకు ఉపక్రమించింది.పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి కారణమైన ఎనిమిది మంది అధికారులను లోక్ సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసింది.
మరోవైపు ఉభయ సభల్లో విపక్ష సభ్యులు నిరసనకు దిగారు.నిన్నటి ఘటనపై మండిపడుతున్న విపక్షాలు హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
అయితే పొగదాడి ఘటనపై లోక్ సభలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు.ఈ ఘటనను అందరూ ఖండించాలన్న ఆయన భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనను విపక్షాలు రాజకీయం చేయడం సరికాదని వెల్లడించారు.విపక్షాల ఆందోళన నడుమ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి.







