కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర( Director Upendra ) గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆయన 1995 నుంచి ఇప్పటివరకు ఎన్నో సంచలనాలు విజయాలు సాధించాడు.
సినిమాలను ఎప్పుడూ కొత్తగా ప్లాన్ చేయడంలో ఉపేంద్ర ముందు ఉంటాడు.చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు.
ప్రస్తుతం ఈ హీరో ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తూ, ఆ సినిమాలో ఆయన నటిస్తున్నాడు.ఆ మూవీకి ‘యూఐ’( UI ) అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.
సెప్టెంబర్ 18 న ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసారు.ఈ టీజర్‌తో ఉపేంద్ర అందరి అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్ళాడు.
గతంలో ఉపేంద్రపై పదేళ్ల పాటు కన్నడ ఇండస్ట్రీలో( Kannada industry ) బ్యాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

‘యూఐ’ సినిమాకి సంబంధించిన టీజర్ ను సెప్టెంబర్ 18న థియేటర్లో రిలీజ్ చేశారు.టీజర్ చూడడానికి వెళ్ళిన ఆడియన్స్ అందరూ ఉపేంద్ర ఇచ్చిన షాక్ చూసి కొన్ని క్షణాల వరకు తేరుకోలేకపోయారు.అదేంటంటే థియేటర్ లో టీజర్ ప్లే చేయ్యడం మొదలవగానే ఒక్కసారిగా అంతా చీకటిగా మారింది.విజువల్ ఏం లేకుండా కేవలం ఆడియో మాత్రమే వినిపించడంతో అందరూ ఏదో టెక్నికల్ ప్రాబ్లెమ్ అని భావించారు.
కానీ అదే టీజర్ అని తెలియడానికి వారికి కాస్త టైమ్ పట్టింది.

అయితే గత కొద్దిరోజులుగా ఉపేంద్ర పదేళ్ళ వరకూ సినిమాలు చెయ్యకూడదని కన్నడ ఇండస్ట్రీలో నిషేధం విధించిందని వార్తలు వినిపిస్తున్నాయి.దాంతో ఉపేంద్ర అభిమానులు చాలా బాధపడ్డారు.కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
అయితే కొద్దిరోజుల నుండి ఉపేంద్ర సినిమాలో నటించకపోవడమే కాకుండా డైరెక్షన్ కు కూడా దూరంగా ఉన్నారు.దాంతో కన్నడ ఇండస్ట్రీ ఉపేంద్రను బ్యాన్ చేసినట్టుగా ప్రచారం జోరుగా జరిగింది.
ఒక ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఉపేంద్రను అడగగా అతను సమాధానం చెప్తూ ‘ నటన వైపు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే డైరెక్షన్ కు దూరంగా ఉన్నట్టు’ తెలిపారు.