ప్రస్తుతం వింటర్ సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.
వాటి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.అలాగే డైట్‌లో పోషకాహారాన్ని చేర్చుకోవాలి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే లడ్డూను రోజుకొకటి చొప్పున తీసుకుంటే అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డు ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఆరు బాదం పప్పులను తీసుకుని వేడి నీటిలో వేసి పొట్టు తొలగించాలి.ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు నువ్వులు వేసి లేట్‌గా డ్రై రోస్ట్ చేసుకోవాలి.
అలాగే పొట్టు తీసిన బాదం పప్పులు, ఆరు జీడి పప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మూడింటినీ చల్లార బెట్టుకుని.ఆపై మిక్సీ జార్‌లో ఒక కప్పు బెల్లంతో పాటు వేసి మెత్తగా గ్రాండ్ చేసుకోవాలి.అనంతరం ఇందులో మూడు స్పూన్ల నెయ్యి, అర స్పూన్ యాలకుల పౌడర్ వేసి లడ్డూల్లా చుట్టుకోవాలి.
ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి.ఇక ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది.
దాంతో వివిధ రకాల వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు దరి దాపుల్లో రాకుండా ఉంటాయి.అలాగే బోలెడన్ని పోషకాలు కలిగి ఉండే ఈ లడ్డూలను రెగ్యులర్‌గా తీసుకుంటే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెంది రక్త హీనత పరార్ అవుతుంది.

అంతే కాదు, ఈ లడ్డూలను తినడం వల్ల చలిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.నీరసం, అలసట వంటి సమస్యలు తొలగిపోయి ఫుల్ యాక్టివ్‌గా మారతారు.ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.మోకాళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.కంటి చూపు పెరుగుతుంది.మరియు జుట్టు రాలడం కూడా తగ్గు ముఖం పడుతుంది.