స్త్రీలనే కాదు పురుషులనూ తీవ్రంగా భయపెట్టే జుట్టు సమస్యల్లో వైట్ హెయిర్ ముందు వరసలో ఉంటుంది.అందులోనూ చిన్న వయసులోనే బ్లాక్ హెయిర్ వైట్‌గా మారితే.
ఇక వారి బాధ వర్ణణాతీతమనే చెప్పాలి.పోషకాల లోపం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో చోటుచేసుకున్న మార్పులు, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడటం, కాలుష్యం, హెయిర్ కేర్ లేక పోవడం, వయసు పైబడటం వంటి కారణాల జుట్టు త్వరగా తెల్ల బడుతుంది.
కారణం ఏదైనా వైట్ హెయిర్ వచ్చాక దాన్ని కవర్ చేసుకుంటూ నానా పాట్లు పడేకంటే.రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ న్యాచురల్ చిట్కా అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ చిట్కా ఏంటో లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే.అందులో రెండు టేబుల్ స్పూన్ల టీ పౌడర్, నాలుగు బిర్యానీ ఆకులు, రెండు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి పది నుంచి పది హేను నిమిషాల పాటు బాగా మరిగించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుని.వాటర్‌ను మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ వాటర్‌లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను మిక్స్ చేసి.స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.ఆ తర్వాత ఈ వాటర్‌ను జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేసుకుని గంట పాటు వదిలేయాలి.అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి హెడ్ బాత్ చేయాలి.
ఇలా వారంలో ఒక్కసారి చేశారంటే వైట్ హెయిర్ సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.మరియు జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.