హోమ ద్రవ్యాలు వాడితే ఫలితం ఏమిటి?

హోమాలు సకల సమస్యలు నివారిస్తాయి.కొన్ని సమస్యలకు కొన్ని రకాల హోమాల చేస్తో మంచి ఫలితం ఉంటుంది.

 What Is The Result Of Using Homam Liquids, Hoamam, Homa Dravyalu, Homam Uses, Im-TeluguStop.com

హోమాలు చాలా రకాలు ఉంటాయి.చండీ హోమం, రుద్ర హోమం, గణపతి హోమం, సుదర్శన హోమం, గరుడ హోమం, మన్యుసుక్త హోమం, మృత్యుంజయ పాశుపత హోమం ఇలా చాలా రకాల హోమాలు ఉన్నాయి.

వీటిలో ఒక్కో హోమం యొక్క ప్రయోజనం ఒక్కోలా ఉంటుంది.

అయితే హోమం ఏది అయినప్పటికీ అందులోవాడే ద్రవ్యాలు దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి.

ముఖ్యంగా హోమంలో యజ్ఞవృక్ష అంటే రావి, జువ్వి, మర్రి, మేడి సమిధిలను వాడతారు.హోమం నిర్వహిస్తున్న సమయంలో వీటిని వాడటం వల్ల శాంతి కలుగుతుందని పండితులు చెబుతారు.

యజ్ఞవృక్ష పుష్పాలను వాడితో సౌభాగ్యం కలుగుతుంది.హోమం గావిస్తున్నప్పుడు అందులో సుగంధ ధూప ద్రవ్యాలు వేస్తే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది.

పాలు, పెరుగు వాడినట్లైతే పుష్ఠీ ఉంటుంది.అన్నముతో-సర్వవాంఛలు, నేయితో చిరంజీవులైన పుత్రులు కలుగుతారు.

తెల్లని పద్మములతో బ్రాహ్మీ సంపద వస్తుంది.శ్రీ(మారేడు) పుష్పములతో మారేడు సమిధలతో పద్మములతో మహత్ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.

అలాగే జ్ఞానం సిద్ధిస్తుంది.గోఘృతమును హోమం సమయంలో వినియోగిస్తే జ్ఞానం వస్తుంది.

కాల పుష్పాలు వాడినట్లైతే కోరుకున్న వరుడు లేదా వధువు వస్తారని చెబుతారు.ఆవు పేడతో చేసిన పిడకలను హోమం సమయంలో వాడతారు.

వీటి వల్ల గొప్ప సంపద సిద్ధిస్తుంది.గరికతో-ఆయుర్ వృద్ధి చెందుతుంది.

పవిత్రమైన మట్టిని వాడినట్లైతే భూములు కొనే అవకాశం కలుగుతుంది.యవల ఉపయోగంతో శారీరక సుఖం ప్రాప్తిస్తుంది.

నువ్వులను వాడితే సర్వజన ప్రియత్వము కలుగుతుంది.బ్రహ్మవృక్ష సమిధలతో – బ్రహ్మ వర్చస్సు సిద్దిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube