శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మూడు నామాలే ఎందుకు అలంకరిస్తారో తెలుసుకోండి..?

శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ) వారి రూపాన్ని తలచుకోగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది ఏడుకొండలు, మూడు నామాలు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే స్వామి వారి రూపంలో ముందుగా ఆకట్టుకునే అత్యంత ప్రత్యేకమైన ఈ నామాల వెనుక దాగున్న అర్థం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 Know Why Sri Venkateswara Swamy Adorns Them With Only Three Names , Sri Venkates-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మనం చూసేది సత్వగుణం.ఈ సత్వగుణం మనుషులలో ఉంటే అది మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది.

తెల్ల నామాలు సత్వ గుణాన్ని దాని వల్ల కలిగే ఉద్రేక రహిత స్థితిని తెలియజేస్తాయి.అది పునాదిగా ఉండాలని కింద పాదపీఠం ఉంటుంది.సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకు వెళుతుందని సూచించేదే నిలువ బొట్టు.సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు ( Shri Mahavishnu )వెనుక రెండు తెల్లని ఊర్ధ్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు.

ఇక విశ్వమంతా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు.అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభ సూచకం, మంగళకరమైనది.కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు.

ఇది మొట్ట మొదటి సారి రామానుజాచార్యులు( Ramanujacharyulu ) స్వయంగా తన స్వహస్తాలతో స్వామికి మూడు నామాలు అలంకరించారు.అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది.శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ ప్రారంభంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు.

శుక్రవారం అభిషేకం తర్వాత మూడు నామాలు అలంకరిస్తే మళ్లీ వచ్చే శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామాలు అలానే ఉంటాయి.అంటే వారానికి ఒక్కసారి మాత్రమే శ్రీవారికి మూడు నామాలు దిద్దుతు ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube