రైతులను ప్రభుత్వం మోసం చేయడం ఒక్క ఏపీలోనే కనిపిస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు.టీడీపీ హయాంలో జల వనరుల శాఖలో రూ.68 వేల కోట్ల పనులు చేస్తే వైసీపీ హయాంలో రూ.28 వేల కోట్ల పనులు చేశారన్నారు.ఆందోళన చేస్తేనే రైతులకు, కౌలు రైతులకు డబ్బు ఇస్తున్నారని తెలిపారు.సీఆర్డీఏ ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మాణం జరగాలని పేర్కొన్నారు.అమరావతిలో పేదలకు టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.తమ అపార్ట్ మెంట్ లోనే 32 దొంగ ఓట్లు వచ్చాయన్న దేవినేని అపార్ట్ మెంట్ లో లేని వారికి కూడా ఓటు కార్డులు పంపారని చెప్పారు.
ఓట్ల చేరికలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.







