Vitamin D Deficiency : మహిళల్లో విటమిన్-డి లోపం ఉంటే.. ఈ వ్యాధులు రావడం ఖాయం..!

ఇంటి మరియు కుటుంబ బాధ్యతల భారం కారణంగా చాలా సార్లు మహిళలు తమ ఆరోగ్యన్ని జాగ్రత్తగా చూసుకోలేరు.కానీ కొన్ని పోషకాలు వారి శరీరానికి చాలా ముఖ్యమైనవి.

 Vitamin D Deficiency : మహిళల్లో విటమిన్-డి ల-TeluguStop.com

అవి లోపిస్తే మహిళలు ఎన్నో వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది.అలాగే బలహీనతను కూడా ఎదుర్కోవచ్చు.

అలాంటి పోషకాలలో ఒకటి విటమిన్ డి.ఇది స్త్రీలలో లోపం ఉండకూడదు.లేకుంటే వారు పక్షవాతం, ఎముకలు, కీళ్లలో నొప్పి ఎదుర్కోవచ్చు.ఈ విటమిన్ లోపాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.శరీరంలో విటమిన్ తక్కువ స్థాయిలో ఉన్న స్త్రీలు రోగ నిరోధక వ్యవస్థలకు నష్టం కలిగి ఉంటారు.అలాగే అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది.

Telugu Bone Pain, Diseases, Tips, Immune System, Vitamin-Telugu Health

శరీరంలో విటమిన్ డి రోగ వ్యవస్థను బలపరుస్తుంది.ఇది అంటువ్యాధులు మరియు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.విటమిన్ డి( Vitamin D ) లోపం కారణంగా మహిళలు రోజువారి జీవితంలో సాధారణ కార్యకలాపాలను నిర్వహించడం వలన కష్టంగా ఉంటుంది.ఇక వారు తరచుగా అలసట మరియు బలహీనతను ఎదుర్కొంటారు.

ఎందుకంటే అలాంటి పరిస్థితిలో శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతుంది.మానసిక ఆరోగ్యాన్ని( Mental health ) కాపాడుకోవడంలో విటమిన్ డి సహాయపడుతుంది.

మహిళలు మానసికంగా సెన్సిటివ్ గా ఉంటారు.కాబట్టి వారు ఈ విటమిన్లను పొందాలి.

Telugu Bone Pain, Diseases, Tips, Immune System, Vitamin-Telugu Health

లేదంటే ఒత్తిడి మరియు నిరాశకు గురవుతారు.క్యాల్షియం లానే విటమిన్ డి కూడా ఎముకల దృఢత్వానికి కారణం అవుతుంది.కాబట్టి స్త్రీలు తమ శరీరంలో విటమిన్ డి తగినంత పొందకపోతే వారి ఎముకలు బలహీనపడతాయి.అలాగే ఎముకలలో నొప్పి( Bone Pain )ని కలిగిస్తాయి.అయితే విటమిన్ డినీ పొందడానికి ఏం చేయాలంటే సూర్యరష్మి దగ్గర 10 నుండి 20 నిమిషాలు గడపాలి.సూర్యకాంతిలో 10 నుండి 20 నిమిషాలు ఉంటే విటమిన్ డి లోపం ఉండదు.

అలాగే విటమిన్ డి పాల ఉత్పత్తులు, కొవ్వు చేపలు, పుట్టగొడుగులు లాంటి కొన్ని ఆహారాల ద్వారా కూడా పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube