తెల్ల జుట్టు( white hair ).ఇటీవల రోజుల్లో వయసు పైబడిన వారే కాకుండా వయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
పెరిగిన కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, థైరాయిడ్, స్మోకింగ్, విటమిన్ బి 12 లోపం తదితర అంశాలు వైట్ హెయిర్ కు కారణం అవుతున్నాయి.ఏదేమైనా తెల్ల జుట్టు చాలా మందికి మనశ్శాంతిని దూరం చేస్తుంది.
ఈ క్రమంలోనే తెల్ల జుట్టును మార్కెట్లో లభ్యమయ్యే కృత్రిమ రంగులతో కవర్ చేస్తూ ఉంటారు.కానీ తెల్ల జుట్టును సహజంగా కూడా నల్లగా మార్చుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆవ నూనె వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ భృంగరాజ్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ ( Amla powder )వేసుకుని కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుని మరో ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తయారు చేసుకున్న మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.ఆపై ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే.ఈ రెమెడీ తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మారుస్తుంది.పర్మినెంట్ గా వైట్ హెయిర్ కు చెక్ పెడుతుంది.అలాగే ఈ రెమెడీని తరచూ ప్రయత్నించడం వల్ల జుట్టు షైనీ గా మారుతుంది.
హెయిర్ రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.