తిరుమల తిరుపతి దేవస్థానానికి మన దేశ నలుమూలల నుంచి చాలా మంది భక్తులు వచ్చి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ తిరుమల శ్రీవారి దేవస్థానం జనవరి రెండవ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.
ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింగల్, అదనపు ఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు.ఈ సందర్భంగా దేవాలయంలోని ఆనంద నిలయం మొదలుకొని, బంగారు వాకిలి వరకు శ్రీవారి దేవాలయంలో లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల చోటు, ఆలయ ప్రాణంగం గోడలు, పైకప్పులతో పాటు పూజా సామాగ్రిని శుద్ధి చేసినట్లు వెల్లడించారు.
ఆ తర్వాత పవిత్ర పరిమళ జలంతో ఆలయాన్ని ప్రోక్షణం చేసినట్లు సమాచారం.ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు మధుసూదన్ యాదవ్, సివిఎస్ఓ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్, డిప్యూటీ ఈవో రమేష్ బాబు, పేస్కర్ శ్రీహరి, వీజీవో బాలిరెడ్డి, ఏవీఎస్ ఓ సురేంద్రబాబు పాల్గొన్నారు.
ఇంకా చెప్పాలంటే శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన భక్తుల సంఖ్య భారీగా ఉంది.
మంగళవారం సాయంత్రానికి ధర్మ దర్శనానికి ఎస్ ఎస్ టి టోకెన్లు లేకుండా క్యూ లైన్ లో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్నీ కంపార్ట్మెంట్లు, నారాయణ గిరి షెడ్లు నిండిపోయి, ఏ టీజీహెచ్ అతిథి గృహం వరకు వేచి ఉండడం విశేషం.వీరికి దాదాపు 24 గంటల్లో స్వామివారి దర్శనం లభించనుందని దేవస్థానం అధికారులు తెలిపారు.సోమవారం శ్రీవారిని దాదాపు 62,000 మంది భక్తులు దర్శించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం దాదాపు నాలుగు కోట్లు వచ్చిందని సమాచారం.ఇంకా చెప్పాలంటే 31 వేలమంది శ్రీవారికి తలనీలలు సమర్పించారు.
గదుల కోసం రద్దీ కొనసాగుతూనే ఉంది.