అమావాస్యనాడు ఈ పూలతో అమ్మవారిని పూజిస్తే.. మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు..!

సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు కావాలని భావిస్తూ ఉంటారు.అలాగే తమ జీవితంలో అన్నీ కూడా వాళ్లకు అనుకున్నట్టు కలిసి రావాలని తాపత్రయ పడుతుంటారు.

 If You Worship Goddess With These Flowers On Amavasya.. No One Else Will Be As-TeluguStop.com

అయితే అలా కలిసి రావడం కోసం చాలామంది సొంత బలం మాత్రమే కాకుండా దైవ బలాన్ని కూడా నమ్ముతుంటారు.చాలావరకు దైవ బలం అనేది అదృష్టానికి బాగా కలిసి వస్తుంది.

కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కొన్ని పర్వదినాల్లో దైవ పూజ చూస్తే అదృష్టం వెంట ఉంటుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.మరి ముఖ్యంగా అమావాస్య ( Amavasya)రోజులలో పూజలు చేస్తే మాత్రం మీ వెంట అదృష్టం ఉండడం ఖాయం.

అందుకే మీకు కూడా ధన ప్రాప్తం, ధనయోగం కలగాలన్న, అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు కావాలన్నా ఆదివారం అమావాస్య రోజు లక్ష్మీదేవి( Goddess Lakshmi ) అమ్మవారిని పువ్వులతో పూజ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు కలుగుతాయి.

Telugu Amavasya, Devotional, Goddess Lakshmi, Holy Cow, Jasmine Flowers, Saffron

అమావాస్యనాడు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకుని, గడపను కూడా శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమ, పిండితో ముగ్గు వేయాలి.అలాగే ఇంటిని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.ఇక 108 మల్లె పువ్వుల( Jasmine flowers )ను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి.

అంతేకాకుండా మల్లెపూల దండ లక్ష్మి అమ్మవారికి సమర్పించాలి.ఇక ఒక్కొక్క అమ్మవారి పేరుకు ఒక్కొక్క మల్లెపువ్వు సమర్పించాలి.

అలాగే పాలతో తయారుచేసిన పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.ఇక ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి.

అంతేకాకుండా హారతి ఇచ్చే సమయంలో 21 లవంగాలు వేయటం వలన నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది.

Telugu Amavasya, Devotional, Goddess Lakshmi, Holy Cow, Jasmine Flowers, Saffron

ఇలా ప్రతి అమావాస్య రోజున చేస్తే మంచి ఫలితాలు అందుతాయి.అంతేకాకుండా అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపించడం వలన కూడా అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందుతాయి.అలాగే అన్నదానం చేసే ప్రదేశంలో ఆకుపచ్చని కూరగాయలు కాకుండా అక్కడికి కావాల్సిన ఆహార పదార్థాలను దానంగా ఇవ్వడం కూడా చాలా మంచిది.

ఇలా చేయడం వలన మీపై ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది.ముఖ్యంగా ఆడవాళ్లు ఎప్పుడు కూడా కుంకుమ బొట్టు, నల్లపూసలను ధరించాలి.ఇలా చేయడం వలన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube