సింగపూర్ ప్రధానికి బాబు ఆహ్వానం

అక్టోబర్ 22న అత్యంత వైభవంగా నిర్వహించబోయే ఏపీ రాజధాని అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రధాని లే సిన్ లూంగ్ ను స్వయంగా, అధికారికంగా ఆహ్వానించారు.

సింగపూర్ వెళ్ళిన బాబు అక్కడే ఆహ్వానం పలికారు.

ఆ సమయానికి అర్జంట్ పనులు లేకపోతే సింగపూర్ ప్రధాని తప్పక హాజరయ్యే అవకాశం ఉంది.ఏపీ రాజధాని నిర్మాణానికి ప్రధాన సూత్ర్రదారి అయిన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఈశ్వరన్ కు కూడా బాబు ఆహ్వానం పలికారు.

ఒకవేళ ప్రధాని రాలేక పోయినా ఈయన తప్పక హాజరవుతారు.ఈయనే కీలక వ్యక్తీ కదా.స్విస్ చాలంజ్ విధానంలో రాజధాని నగర నిర్మాణం పై బాబు మంత్రి ఈశ్వరన్ తో చర్చలు జరిపారు.రాజధాని కోసం సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మూడు మాస్టర్ ప్లాన్లు తయారు చేసింది.

శంకుస్థాపన కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో చేయాలని బాబు నిర్ణయించారు.ఈ కార్యక్రమ నిర్వహణ కోసం (ఈవెంట్ మేనేజ్మెంట్) ప్రపంచ వ్యాప్తంగా బిడ్లు ఆహ్వానిస్తున్నారని సమాచారం.

Advertisement

ఓ పక్క బీద అరుపులు అరుస్తున్న బాబు మరో పక్క కోట్ల రూపాయలు హారతి కర్పూరంలా ఖర్చు చేయడానికి వెనుకాడటంలేదు.తన ఘనత చాటుకోవడానికి ప్రజాధనం వెదజల్లుతున్నారు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు