వైరల్ వీడియో: బట్టల దుకాణంలోకి దూసుకెళ్లిన ఎద్దులు.. చివరికి..?

కొన్నిసార్లు జంతువులు జనాలపైకి చొరబడి గందరగోళానికి దారితీసే సంఘటనలను మనం తరచుగా చూస్తాము.ఇలా కొన్నిసార్లు ఏనుగులు ప్రజలపై దాడులు చేసి పారిపోయేలా చేస్తాయి.

 Viral Video: The Bulls That Ran Into The Clothes Shop.. In The End, Viral Video-TeluguStop.com

కొన్నిసార్లు దున్నపోతులు కూడా వ్యక్తులపై దాడి చేస్తాయి.ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చూసే ఉంటాము.

తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ చివరకు బట్టల దుకాణం( Cloth shop )లోకి చొరబడ్డాయి.

దాంతో చివరికి ఏం జరిగిందో చూస్తే.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media)లో వైరల్‌గా మారింది.బట్టల దుకాణంలోకి రెండు ఎద్దులు పోట్లాడుకుంటూ అకస్మాత్తుగా ఎద్దులు( Bulls ) లోపలికి రావడంతో దుకాణంలోని వ్యక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు.ఓ ఎద్దు మరో ఎద్దుపై దాడి చేయడంతో అది పారిపోయేందుకు ప్రయత్నించి దుకాణంలో ఉన్న బట్టలపై పడింది.

గోడకు ఉన్న అరల్లోకి అడుగు పెట్టగానే చీరలన్నీ కుప్పలుగా షాప్ లో కిందపడిపోయాయి.

దాంతో దుకాణంలోని బట్టలన్నీ నేలపై చెల్లాచెదురుగా పడి పోయాయి.బయట భయంతో చూస్తున్న ప్రజలు లోపలికి వెళ్లేందుకు సాహసించలేకపోయారు.ఈ ఎద్దులు దుకాణంలో చాలాసేపు గందరగోళం సృష్టించాయి.

ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.చూసిన వారంతా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.“అయ్యో.ఇలా వీటిని చూస్తుంటే భయంగా ఉంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube