సుమ ముందు తన కోరికను బయటపెట్టిన హీరో కార్తికేయ.. షాక్ లో సుమ!

బుల్లితెర యాంకర్ గా సుమ ( Suma) ఇటీవల కాలంలో సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా మారిపోయారు అయితే ఈటీవీలో సుమ అడ్డా (Suma Addaa) అనే పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం అవుతుంది అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు.

 Hero Karthikeya Express Her Wish To Suma , Karthikeya, Suma, Bhaje Vayu Vegam T-TeluguStop.com

ఇందులో భాగంగా భజే వాయు వేగం( Baje Vayuvegam ) టీం సందడి చేశారని తెలుస్తుంది.ఈ కార్యక్రమానికి హీరో కార్తికేయ( Karthikeya) తో పాటు హీరోయిన్ దర్శకుడు కూడా పాల్గొని సందడి చేశారు.

ఇక ఎప్పటిలాగే సుమ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరిపై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటారు.ఇక సెలబ్రిటీలు కూడా సుమ మీద ఇటీవల కాలంలో భారీ స్థాయిలో పంచులు వేస్తున్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సుమ జ్యూస్ తీసుకువచ్చి సెలబ్రిటీలకు ఇచ్చారు.ఈ జ్యూస్ కి ఒక స్పెషాలిటీ ఉందని ఆమె తెలిపారు.ఇది తాగిన వారు ఎవరైనా వారి మనసులో ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని తెలిపారు.

ఈ క్రమంలోనే హీరో కార్తికేయ ఈ జ్యూస్ తాగిన తర్వాత ఏం కోరుకున్నారు అంటూ సుమా ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు హీరో సమాధానం చెబుతూ నా సినిమాకు సుమ గారు ప్రొడ్యూస్ చేయాలని కోరుకున్నాను అంటూ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.దీంతో ఒక్కసారిగా బిత్తర మొహం వేసుకుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ సినిమా మే 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కార్తికేయకు జోడిగా ఐశ్వర్య మీనన్( Aishwarya Menon ) హీరోయిన్గా నటిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube