సాధారణంగా ఎవరైనా సరే తమ పెళ్లిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.అంత మంచిగా చేసుకున్న పెళ్లి పటాకులు అయితే తీవ్రంగా డిప్రెషన్‌కి లోనై బాధపడతారు కానీ పాకిస్థాన్‌కు చెందిన ఒక మహిళ మాత్రం విడాకుల పార్టీ చేసుకుంది, భర్తతో విడిపోయిన తర్వాత ఆమె గ్రాండ్‌గా పార్టీ చేసుకుని షాక్ ఇచ్చింది.
ఈ డివోర్స్ సెలబ్రేషన్స్( Divorce Celebrations ) లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో సమాజంలో విడాకుల గురించి ఉన్న ఆలోచనలను పూర్తిగా మార్చేస్తోంది.
ఆ మహిళ పర్పుల్ కలర్ లెహంగా కట్టుకొని ఒక ఫేమస్ బాలీవుడ్ సాంగ్‌కు డాన్స్ చేస్తుంది.ఆమె డ్యాన్స్ చేస్తుండగా, ఆమె స్నేహితులు ఆమెను ప్రోత్సహిస్తూ, ఆమెపై నోట్లను వర్షంలా కురిపిస్తున్నారు.పార్టీలో ‘డివోర్స్ ముబారక్( Divorce Mubarak )’ అని రాసిన బెలూన్లు కూడా ఉన్నాయి.దీని అర్థం ‘విడాకులు పొందినందుకు శుభాకాంక్షలు’ అని.
పాకిస్థాన్( Pakistan ) మీడియా ప్రకారం, ఆ వీడియో అమెరికాలో షూట్ చేయడం జరిగింది.ఆ మహిళ అమెరికాలో ఒక దుకాణం నడుపుతుంది.తన భర్తతో ఎందుకు విడిపోయిందో ఆమె చెప్పలేదు.ఈ వీడియో సోషల్ మీడియాలో చూసిన వారు కొందరు ఆమెను ప్రశంసించారు.ఎందుకంటే ఆమె ఒక చెడు సంబంధం నుంచి బయటపడింది.కానీ మరికొందరు ఆమెను తప్పు పట్టారు.
ఒక వ్యక్తి “నేను ఈ రోజు జ్వరం వచ్చి ట్విట్టర్‌ని ఓపెన్ చేయలేదు.కానీ ఓపెన్ చేసి చూస్తే, ఒక విడాకుల పార్టీ జరుగుతోంది.
ఇది చూసి నేను చాలా సంతోషించా.పెళ్లి అనేది మూఢనమ్మకాలు, మతం తర్వాత అతి పెద్ద చెడు.” తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.”ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా కష్టం.దానికి చాలా ఏళ్లు పడుతుంది.కానీ ఒక సంబంధాన్ని విడదీయడం చాలా సులభం.కొన్ని సెకన్లలోనే అయిపోతుంది.ఇప్పుడు విడాకులు తీసుకోవడం ఒక పండుగలా చేసుకుంటున్నారు.” అని మరో యూజర్ అన్నారు.“కొంతమంది తమ భర్త కష్టపడి సంపాదించిన డబ్బుతో విడాకుల పార్టీ చేసుకుంటున్నారు.ఆమెకు కోటి రూపాయల భరణం ఇచ్చినట్లు ఉన్నారు.” అని విమర్శించారు.“నా మాటలు మీకు నచ్చకపోయినా పర్వాలేదు కానీ, ఈ మహిళ విడాకులు తీసుకున్నందుకు పార్టీ చేసుకుంటోంది అని చూసి నేను ఆశ్చర్యపోతున్నా.ఇస్లాం మతం ప్రకారం విడాకులు తీసుకోవడం చాలా చెడు విషయం.” అని ఇంకొకరు అన్నారు.