క్యాన్సర్.ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇది వచ్చిందంటే ఒక వ్యక్తిని మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తుంది.ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే దాని నుంచి బయటపడడం కష్టం అని భావించేవారు.కానీ ఇప్పుడు కొన్ని పోషక విలువలతో కూడిన ఆహారం, పండ్లు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ని కూడా నివారించవచ్చు.మరి ఎలాంటి పండ్లు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ని నివారించవచ్చు అనేది ఇక్కడ తెలుసుకుందాం.
టమాటా:
ప్రతి ఆహారపదార్థంలో ఎక్కువగా ఉపయోగించే టమోటాలలో ఎక్కువగా క్యాన్సర్ పోరాట ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.ఇవి ఫైటో కెమికల్ అయిన లైకోపీన్ లను ఎక్కువగా విడుదల చేయడానికి సహాయపడుతుంది.
ఇది ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్ లను నివారించడంలో సహాయపడుతుంది.
అల్లం:
అల్లం వాస్తవానికి క్యాన్సర్ కణాలు తమను తాము చంపుకునేలా చేస్తుంది.ఒక అధ్యయనం ప్రకారం ఇది అండాశయ క్యాన్సర్ ను పెరగకుండా నిరోధిస్తుంది.అలాగే దాని వ్యాప్తి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది.
వాల్నట్:
ఇందులో ఒమెగా 3 లను కలిగి ఉండి ప్రొస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుండి కాపాడుతుంది.
యాపిల్:
పండ్ల కుటుంబంలో ఆపిల్ అనేక వ్యాధినిరోధక లక్షణాలను కలిగి ఉంది.యాపిల్ పై తొక్కు తినడం వల్ల ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ కణాలను చంపడానికి సహాయపడుతుందని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి.
వెల్లుల్లి:
ఇది అనేక యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది.రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కడుపు క్యాన్సర్ లకు క్యాన్సర్ కణాలను చంపడంతో సహా అనేక విధాలుగా శరీరాన్ని క్యాన్సర్ నుండి దూరం చేస్తుంది.ఇది డిఎన్ఏకి జరిగిన నష్టాన్ని సరిచేయడానికి ఉపయోగపడుతుంది.
గుమ్మడి కాయ:
గుమ్మడి కాయలో విటమిన్ ఇ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది.ఇది క్యాన్సర్ ను నివారించడానికి సహాయపడుతుంది.క్యాన్సర్ ను నిరోధించే లక్షణాలు గుమ్మడి కాయలో మెండుగా ఉన్నాయి.
నారింజ:
విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి క్యాన్సర్ నుంచి విముక్తి కలిగిస్తుంది.శాస్త్రవేత్తల ప్రకారం క్యాన్సర్ ను దూరంగా ఉంచడానికి రోజు ఒక నారింజ పండు అద్భుతమైన మార్గం.అంతేకాకుండా సిట్రస్ జాతి పండ్లు తినడం వల్ల దాదాపు అన్ని రకాల వ్యాధుల నుంచి 50 శాతం వరకు ఉపశమనం పొందవచ్చు.
అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరచుకోవచ్చు.