గంటల తరబడి కూర్చుని ఉండటం, బయట ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, మద్యపానం ధూమపానం వంటి వ్యాసాలు తదితర కారణాలు వల్ల ఈ మధ్యకాలంలో ఎవరికీ చూసినా బాన పొట్టే( Pot Belly ) కనిపిస్తుంది.మీరు కూడా బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారా.? పొట్టను తగ్గించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారా..? అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకుంటే బాన పొట్ట ఐస్ కంటే వేగంగా కరుగుతుంది.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ అల్లం తురుము,( Ginger ) వన్ టీ స్పూన్ పచ్చి పసుపు( Turmeric ) తురుము వేసుకోవాలి.అలాగే అంగుళం ములేటి స్టిక్ ను కచ్చాపచ్చాగా దంచి వాటర్ లో వేసి మరిగించాలి.దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగిస్తే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.
స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేయడమే.

నిత్యం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పొట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు( Belly Fat ) మొత్తం క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పైగా వెయిట్ లాస్ లో కూడా ఈ మ్యాజికల్ డ్రింక్ తోడ్పడుతుంది.అలాగే నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.అంతేకాకుండా ఈ డ్రింక్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది.
జలుబు, దగ్గు వంటి సమస్యలను తరిమికొడుతుంది.మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా ఈ డ్రింక్ సహాయపడుతుంది.