శరీర ఆరోగ్యానికి ఐరన్ అంత అవసరమా.. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు..

ఈ మధ్యకాలంలో సమాజంలోని ప్రజలందరికీ ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది.అంతేకాకుండా ప్రజలు ప్రతి విషయాన్ని వారి ఆరోగ్యం పై ప్రభావం చూపకుండా చూసుకుంటున్నారు.

 Significance Of Iron To Body And Foods Which Are Rich In Iron Details, Significa-TeluguStop.com

అంతలా చూసుకుంటూ ఉంటే కూడా కొన్ని కొన్ని సార్లు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి.ఎందుకంటే శరీరంలోని భాగాలకు ఏ ఒక్క విటమిన్లు తగ్గినా ఏవో ఒక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

ఐరన్ శరీరానికి ఎంతో ముఖ్యమైన మినరల్.ఇది శరీరంలోని ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ను రక్తం ద్వారా శరీరానికి అందించడానికి ఉపయోగపడుతుంది.

ఈరోజు వారి శరీరానికి 18 ఎం జీ అవసరం అవుతుంది.అయితే ఆహారం నుంచి శరీరం ఎంత ఐరన్ ను గ్రహిస్తుందనేది మీ శరీరంలో ఉన్న ఐరన్ నిల్వల మీద ఆధారపడి ఉంటుంది.

కాబట్టి ప్రతి రోజు ఐరన్ ఉండే ఆహారాన్ని తింటూ ఉండడం మంచిది.బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.వందగ్రాముల బచ్చలి కూర నుంచి 2.7 ఎంజీ ఐరన్ శరీరానికి లభించే అవకాశం ఉంది.ఇది రోజువారీ శారీరక ఐరన్ అవసరాల్లో 15 శాతం.విటమిన్-సి కూడా ఇందులో ఉంటుంది.ఇందులో కెరొటినాయిడ్స్ అనే యాంటి ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.చిక్కుళ్ళలో చాలా రకాల పోషకాలు ఉంటాయి.

Telugu Broccoli, Greenleafy, Tips, Iron, Iron Deficiency, Iron Rich Foods, Nuts,

ఇంకా చెప్పాలంటే వీటిలో బీన్స్, చిక్కుడు కాయలు, బఠాణీలు, సోయాబీన్స్, అన్ని రకాల పప్పులు లెగ్యూమ్స్ లేదా చిక్కుళ్ళ కిందకి వస్తాయి.వీటిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది.ఒక కప్పు వండిన పప్పులో 6.6 ఎంజీ ఐరన్ ఉండే అవకాశం ఉంది.ఇది రోజువారీ శారీరక అవసరాల్లో 37 శాతం.చిక్కుళ్లలో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం ఉండడం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.100 గ్రాముల టర్కీ మాంసంలో 1.4 ఎంజీ ఐరన్ లభిస్తుంది.ఇది రోజు వారీ శారీరక అవసరాల్లో 8 శాతం.ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉండే ఈ ఆహారం బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube