అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దూకుడు నిర్ణయాలతో షాకిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.( Donald Trump ) మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో నియమితులైన వారిని, తనను టార్గెట్ చేసిన వారిపై ట్రంప్ ఫోకస్ చేస్తున్నారు.
తాజాగా బైడెన్ హయాంలో బ్యూరో ఆఫ్ కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ (సీఎఫ్‌పీబీ) డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన భారత సంతతికి చెందిన అధికారి రోహిత్ చోప్రాపై( CFPB Chief Rohit Chopra ) ట్రంప్ వేటు వేశారు.
నిజానికి డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు చోప్రా సమర్ధతను గుర్తించి ఫెడరల్ ట్రేడ్ కమీషన్ సభ్యుడిగా నియమించారు.
బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యూరో ఆఫ్ కన్జ్యూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్( Consumer Financial Protection Bureau ) డైరెక్టర్‌గా నియమించారు.తన హయాంలో క్రెడిట్ రిపోర్టుల నుంచి మెడికల్ లోన్‌లను తగ్గించడం వంటి సంస్కరణలను రోహిత్ చోప్రా తీసుకొచ్చి ప్రశంసలు అందుకున్నారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో ఆయన విధానాలకు అనుగుణంగా పనిచేసేందుకు చోప్రా సిద్ధమయ్యారు.కానీ ట్రంప్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వకుండా రోహిత్ చోప్రాను తొలగించారు.

వైట్‌హౌస్( White House ) నుంచి ఆదేశాలు రావడంతో సోషల్ మీడియాలో చోప్రా స్పందించారు.ఇంతకాలం తమ ఆలోచనలను, ప్రణాళికలను పంచుకున్న వారికి , తనకు సహకరించిన వారికి రోహిత్ చోప్రా ధన్యవాదాలు తెలిపారు.కొలంబియాలో స్థిరపడిన చోప్రా గతంలో సీఎఫ్‌పీబీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు.అలాగే యూఎస్ ఎడ్యుకేషన్ విభాగానికి ప్రత్యేక సలహాదారుగాను వ్యవహరించారు.

ఇదిలాఉండగా.సీఎన్ఎన్ వర్గాల సమాచారం ప్రకారం .సోమవారం నాటికి పదవీ విరమణ లేదా రాజీనామా చేయాలని లేదా డిమోషన్ ఎదుర్కోవాలని అనేక మంది సీనియర్ ఎఫ్‌బీఐ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.సైబర్, జాతీయ భద్రత, నేర పరిశోధనలు వంటి కీలక రంగాలను పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇన్‌ఛార్జ్ స్పెషల్ ఏజెంట్లు వంటి ఉన్నత స్థాయి అధికారులను ఈ తాజా ఆదేశం ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.