దురద( Itching ) అనేది సాధారణంగా చాలామంది ప్రజలు ఎదుర్కొంటూ ఉంటారు.ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, పొడి చర్మం లేదా కీటకాల కాటు వేయడం వంటి చాలా రకాల కారణాలవల్ల దురద వస్తూ ఉంటుంది.
అయితే సాముద్రిక శాస్త్రం( Palmistry ) ప్రకారం దురద పుట్టడం వెనుక కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి.సాముద్రిక శాస్త్రం అనేది శరీరం, ప్రకృతి నుంచి వచ్చే సంకేతాలు, శకునాలను వివరించే ఒక రకమైన జ్యోతిష్యం( Astrology ) అని నిపుణులు చెబుతున్నారు.
దీని ప్రకారం ఆకస్మిక, అకారణంగా వచ్చే దురద ఒక వ్యక్తికి జరగబోయే మంచి చెడును సూచిస్తుందని చెబుతున్నారు.ఈ శాస్త్రం ప్రకారం అరచేతులు, పాదాల్లో దురద కలిగితే అవి దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.
సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి పాదంలో దురద పుడితే అదృష్టం, విజయం వరిస్తాయని అర్థం చేసుకోవచ్చు.కుడి పాదంలో దురద అనేది మంచి శకునాలు, అవకాశాలకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.
దీనిని అనుభవించే వ్యక్తి త్వరలో ఒక శుభ ప్రయాణం లేదా విజయవంతమైన వెంచర్ ను మొదలు పెట్టవచ్చు.వారి ప్రణాళికలు కూడా నెరవేరుతాయి.పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.భవిష్యత్తులో సహాయపడే కొత్త కలెక్షన్లను, స్నేహితులను పొందే అవకాశం ఉంటుంది.అలాగే ఎడమ పాదం దురదృష్టం, ఇబ్బందులతో ముడిపడి ఉంటుంది.అందుకే ఎడమ పాదంలో దురద ఉంటే చెడు శకుణాలు, అడ్డంకులకు సంకేతం.
దీని అర్థం వ్యక్తి జీవితంలో త్వరలో ఇబ్బందులు లేదా ప్రమాదాలను ఎదుర్కోవచ్చు.ఈ కారణంగా ఎడమ పాదంలో దురద ఉన్నప్పుడు ప్రయాణించడం లేదా డ్రైవింగ్ చేయడం మానుకోవడమే మంచిది.
వ్యక్తి ఆదాయం కూడా తగ్గవచ్చు.వారికి ఖర్చులు కూడా పెరుగుతాయి.
అనారోగ్య సమస్యలతో( Health issues ) బాధపడతారు.వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది.
సామాజిక శాస్త్రంలో హస్త సాముద్రకం కూడా ఒకటి దీనీ ప్రకారం ఎడమ చేయి( Left Hand ) ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూల అంశాలను సూచిస్తుంది.అందువల్ల ఎడమ అరచేతిలో దురద అనేది దురదృష్టం, నష్టానికి సంకేతం అని నిపుణులు చెబుతున్నారు.సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి అరచేయి వ్యక్తి జీవితం లోని చురుకైన సానుకూల అంశాలను సూచిస్తుంది.అందువల్ల కుడి అరిచేతిలో దురద కలగడం అనేది అదృష్టం, శ్రేయస్సుకు సంకేతం.
కుడి అరచేతిలో దురదను అనుభవించే వ్యక్తులు సాధారణంగా భవిష్యత్తు గురించి సంతోషంగా, ఆశాజనకంగా ఉంటారు.అలాగే వీరు సంపద, సమృద్ధి, దేవత అయిన లక్ష్మీదేవి( Lakshmidevi ) నుంచి ఆశీర్వాదాలు పొందుతారు.
LATEST NEWS - TELUGU